పరిపాలనా రాజధాని విశాఖకు తరలించడం ఖాయం

మంత్రి బొత్స సత్యనారాయణ
 

తూర్పుగోదావరి: పరిపాలనా రాజధాని విశాఖకు తరలించడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలపై కోర్టులను ఒప్పిస్తామని చెప్పారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. నాకు అడ్రస్‌ ఉంది..చంద్రబాబు, లోకేష్‌కు ఇళ్లు ఎక్కడున్నాయని నిలదీశారు. ఆస్తి పన్ను విధానంపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై భారం పడకూడదని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. పన్నుల విధానంపై చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.దళారుల వ్యవస్థను నిరోధించడానికే కొత్త పన్నుల విధానం తీసుకువచ్చామన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top