సమాధానం చెప్పండి చంద్రబాబూ..?

పేదలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణంలోనూ అవినీతా..?

తొలిదశ ఏపీ టిడ్కో రివర్స్‌టెండరింగ్‌లో రూ.105.91 కోట్లు ఆదా చేశాం

పేదలకు ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇవ్వడమే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

 

సచివాలయం: పేదవారికి ఇచ్చే ఇళ్ల నిర్మాణంలో కూడా చంద్రబాబు, ఆయన తాబేదారులుకు అవినీతికి పాల్పడ్డారని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు పేదల ఇళ్ల నిర్మాణంలోనూ కూడా దోపిడీ చేశారనేందుకు ఏపీ టిడ్కో (ఏపీ టౌన్‌షిప్‌ ఇన్‌ఫాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)లో నిన్న జరిగిన రివర్స్‌టెండరింగ్‌ నిదర్శమన్నారు. విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లోని యూనిట్లకు రివర్స్‌టెండరింగ్‌ విధానం ద్వారా రూ.105.91 కోట్లు ఆదా చేశామని మంత్రి బొత్స చెప్పారు.

సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు జిల్లాల్లో ఉన్న 14368 హౌసింగ్‌ యూనిట్లకు టెండర్‌కు వెళ్తే దాని అగ్రిమెంట్‌ కాస్టు రూ.707.4 కోట్లు ఉందని రివర్స్‌టెండరింగ్‌ విధానంలో రూ.601.12 కోట్లకు కోడ్‌ చేయడం జరిగింది. చిత్తూరులో ఉన్న ప్యాకేజీకి రూ.40.85 కోట్లు తక్కువకు వేశారు. అలాగే కృష్ణా జిల్లాలో 14.35, విశాఖపట్నంలో రూ.28.83, విజయనగరంలో రూ.21.88 కోట్లు తక్కువకు కోడ్‌ చేసి కంపెనీలు పనులు దక్కించుకున్నాయని, రివర్స్‌టెండరింగ్‌ విధానం ద్వారా ప్రభుత్వానికి రూ. 105.91 కోట్లు ఆదా అయ్యిందన్నారు. అదే గత ప్రభుత్వంలో అయితే రూ.106 కోట్లు పెరగడమే కాకుండా లబ్ధిదారుడికి రూ. 70 నుంచి రూ. 90 వేల భారం పడేదన్నారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రతి పనిలోనూ పారదర్శకంగా ముందుకు వెళ్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇవ్వాలనేది సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. హౌసింగ్‌ స్కీమ్‌లో రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రూ.105.91 కోట్లు ఆదా చేశారన్నారు. పేదవాడికి ఇచ్చే ఇంటిలో కూడా చంద్రబాబు దోపిడీ చేశారనేందుకు ఇది నిదర్శనమన్నారు. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా పోలవరం ఆలస్యమైపోతుందని మాట్లాడిన చంద్రబాబు, ఆయన తాబేదారులు దీనికి ఏం సమాధానం చెబుతారన్నారు. చంద్రబాబు పంచభూతాలను పంచుకొని తిన్నాడన్నారు.

ట్యాక్సెస్‌ కలుపుకోకోకుంటే చదరపు అడుగు నిర్మాణానికి రూ. 16 నుంచి రూ. 18 వందల ఖర్చు అని, ట్యాక్సెస్‌ కలుపుకుంటే రూ.1793 నుంచి రూ.2055 అవుతుందని అగ్రిమెంట్‌లో ఉందన్నారు. ఇవాళ ట్యాక్సెస్‌ లేకుండా సరాసరి రూ.1312కు చదరపు అడుగు నిర్మాణం జరుగనుందన్నారు. అంటే చదరపు అడుగుకు రూ.300 దోపిడీ జరిగింది ఇది నిజం కాదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. ఇదొక మచ్చు తునక మాత్రమేనని, మళ్లీ వచ్చే నెల డిసెంబర్‌ 12వ తేదీన రూ. 15856 ఇళ్లకు ఇంకో టెండర్‌ ఉందని, దాని అగ్రిమెంట్‌ కాస్టు రూ.791.83 కోట్లు ఉందని, 13వ తేదీ రివర్స్‌టెండరింగ్‌కు వెళ్తామన్నారు. అగ్రిమెంట్‌ కాస్టు రూ.1013.42 కోట్లు ఉన్న డిసెంబర్‌ 19న మరో 21744 యూనిట్లకు టెండర్లు పిలిచి, 20వ తేదీ రివర్స్‌టెండరింగ్‌కు వెళ్తామన్నారు. డిసెంబర్‌ 24వ తేదీన ఇంకొన్ని జిల్లాల్లో రూ.740 కోట్లు అగ్రిమెంట్‌ వ్యాల్యూ ఉన్న 14 వేల ఇళ్లకు టెండర్లు పిలిచి 26న రివర్స్‌టెండరింగ్‌కు వెళ్తామన్నారు. మొత్తం 65968 ఇళ్ల యూనిట్స్‌కు సుమారు రూ. 3253.38 కోట్లకు రివర్స్‌టెండరింగ్‌కు వెళ్తున్నామని బొత్స చెప్పారు.

చంద్రబాబు మూడు లక్షల 10 వేల ఇళ్ల యూనిట్స్‌కు టెండర్లు పిలిచారని, ఆ లెక్క ప్రకారం రూ. 2626 కోట్లు డిఫరెన్స్‌ వాల్యూ ఉందన్నారు. ఆ డబ్బు చంద్రబాబు, ఆయన తాబేదారులు కాజేసేవారన్నారు. ఐదు లక్షల ఇళ్లులకు టెండర్లు పిలిచి ఉంటే రూ. 4 వేల కోట్లకుపైగా దోపిడీ జరిగేదన్నారు. చంద్రబాబు ఇవాళ ఇన్ని కథలు చెబుతున్నాడే.. దీనికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు.  

 

Read Also: కారెం శివాజీ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక 

Back to Top