బీసీల‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు 

వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి  

తాడేప‌ల్లి:  బీసీల‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి మండిప‌డ్డారు. శుక్ర‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో నారాయ‌ణ‌మూర్తి మీడియాతో మాట్లాడారు.

 బీసీల వెన్ను విరిచారు అంటూ చంద్రబాబు, పచ్చమీడియా కలసి దుష్ప్రచారం చేయడాన్ని సహించమ‌ని నారాయ‌ణ‌మూర్తి హెచ్చ‌రించారు. బీసీలకు చంద్రబాబు హయాంలోనే ఎక్కువ మేలు జరిగింది అంటూ "ఆదరణ" పథకాన్ని గురించి గొప్పగా చెబుతున్నావు.  2018-19 లో అంటే దిగిపోయే ముందు 378 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3.5 లక్షల మందికి ఇస్త్రీ పెట్టెలు,వాషింగ్ మెషిన్ లు,కుట్టు మిషన్లు, సెలూన్ షాప్ లో కుర్చీలు ఇచ్చి బీసీలకు గొప్ప మేలు చేసాడు చంద్రబాబు అంటూ డప్పలు కొట్టావు.  నీవు బిసిలను కులవృత్తులలోనే మగ్గిపోవాలని చూశావు.కాని వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజురీయంబర్స్ మెంట్ తెచ్చి బిసిలను ఇంజనీర్లుగా,డాక్టర్లుగా చేశారు.జగన్ గారు మరో పదిఅడుగులు ముందుకు వేసి బిసిలను అన్ని విధాలా అభివృద్దిలోకి తీసుకువచ్చారు.

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని నినాదం ఇచ్చి వారిలో ఆత్మగౌరవం నింపారని నారాయ‌ణ‌మూర్తి తెలిపారు.   గత 40 ఏళ్ల నుండి చంద్రబాబు బీసీలను కేవలం ఎన్నికలప్పుడు ఓటు బ్యాంకు గానే చూసారు తప్ప వారి బాగోగులు గురుంచి ఏనాడన్నా ఆలోచన చేసారా 
అని ప్ర‌శ్నించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బీసీలను వెన్నుముకలా భావించి వారి సంక్షేమం,అభివృద్ధి, ఆత్మగౌరవం నిలబడేలా ఈ 5 ఏళ్ళు ఏమేం చేశారో మీరు తెలుసుకోవాలంటే ఈ జన్మ సరిపోదు మీకు..

వైయ‌స్ జ‌గ‌న్‌ బీసీల కోసమే ప్రత్యేకమైన పథకాలు నేతన్న నేస్తం,చేయూత, మత్స్యకార భరోసా,
చేదోడు,కళ్యాణమస్తు వంటివి అమలుచేసి వారి వేల కోట్ల రూపాయలు వారి సంక్షేమాభివృద్ధికి అందించారని పేర్కొన్నారు. 

నవరత్నాలు సంక్షేమ పథకాలలో 50 శాతం పైన అంటే డీబీటి ద్వారా ఒక లక్షా ముప్పై వేలకోట్ల రూపాయలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నేరుగా మా బీసీల బ్యాంక్ ఖాతాల్లోనే వేశారు.  

 ఇక అభివృద్ధి పనుల్లో 50 శాతం మా బడుగు బలహీన వర్గాలకే కేటాయించేలా చట్టం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ చేసి మరీ మాకు జీవనోపాధి కల్పించారు.  రాజ్యాధికారంలో మునుపెన్నడూ జరగని విధంగా మాకు 50 శాతం చట్టసభల్లో సీట్లు కేటాయించారు..అలాగే స్థానిక సంస్థలలో 65 శాతం మా బడుగులకే అవకాశం కల్పించారు .  పచ్చమీడియా బిసిల గురించి జగన్ గారి గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలే తగిన బుధ్ది చెప్తార‌ని నారాయ‌ణ‌మూర్తి హెచ్చ‌రించారు.
 

Back to Top