తాడేపల్లి: బీఆర్‌ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు ఇవాళ వేకువజామున కన్నుమూశారు. సత్యనారాయణరావు మృతి పట్ల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మరణవార్త తెలియగానే హరీష్‌రావుకు వైయస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. హరీష్‌రావు పితృవియోగంపై వైయస్ జగన్ మోహన్‌రెడ్డి సంతాపం తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సత్యనారాయణ రావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.