మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై కోటి గుండెల నిరసన  

ఊపందుకున్న కోటి సంతకాల సేకరణ

రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం

మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ప్ర‌జా ఉద్య‌మం

తాడేప‌ల్లి:  ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రారంభమైన కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాన జోరుగా కురుస్తున్నప్పటికీ, వైయ‌స్ఆర్‌సీపీ  నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా గ్రామాల్లో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాన్ని పార్టీ శ్రేణులు చేప‌డుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జరుగుతున్న కోటి సంతకాల సేకరణ..అది కేవలం ఒక సంతకం కాదు, కోటి గుండెల నిరసన.  ప్ర‌జ‌ల‌కు మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వివ‌రిస్తూ వారి నుంచి సంత‌కాలు సేక‌రిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించుకోకపోతే  పోరాటం ఉద్ధృతం చేస్తామని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.  కూటమి ప్రభుత్వానికి పేదల శ్రేయస్సు కంటే పార్టీ నాయకుల క్షేమమే ముఖ్యమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలలుగా రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందంటూ ధ్వజమెత్తారు. వైయ‌స్‌ జగన్‌ జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల ఉండాలని 17 మెడికల్‌ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల పాలనలో వాటిని నిర్వీర్యం చేస్తోందని మండి పడ్డారు. మెడికల్‌ సీట్లు వద్దన్న ఏకై క ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్నారు. మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేయాలనుకోవడం అత్యంత దుర్మార్గం అన్నారు. లక్షల కోట్లు విలువ చేసే మెడికల్‌ కాలేజీలను అతి తక్కువ ధరలకు సింగిల్‌ టెండర్‌లోనే అమ్మకాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యం, వైద్య విద్యపై వ్యాపారం చేయొద్దని, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దుర్మార్గమైన ఆలోచనల్ని చంద్రబాబు విరమించుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు సూచించారు.  

ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాల వివరాలు

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా... కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణ - రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య హాజరయ్యారు. భట్టువానిపల్లి గ్రామస్తులతో సంతకాల సేకరణ చేపట్టారు. 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా చుండూరు మండలంలో సంతకాలు సేకరిస్తున్న రాష్ట్ర అధికార ప్రతినిధి వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త  వరికూటి అశోక్ బాబు, నాయకులు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకారణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేయాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.య‌స్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోయరాజమండ్రి గ్రామంలో పోలవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ జరిపారు.

పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారి సారధ్యంలో మెడికల్ కాలేజీల ప్రవేటికరణకు వ్యతిరేకంగా పార్వతీపురం పురపాలక సంఘం 14వ వార్డు పరిధిలో గల బైపాస్ కాలనీలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం

కోటి సంతకాల సేకరణ భాగంగా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమం లో పాల్గొన్న నూజివీడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త  మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట లో సమన్వయకర్త తోట నరసింహం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం

కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరంలో సమన్వయకర్త కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం


తుని నియోజకవర్గం,కోటనందూరు మండలం,అల్లిపూడి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా 


ప్రకాశం జిల్లా కొండేపి  మర్రిపూడి మండలం  వెంకటకృష్ణాపురం గ్రామం లో రచ్చబండ - మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ , నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వర్లు మరియు ముఖ్యనాయకులు హాజరయ్యారు

Back to Top