చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షా యాభై వేల బెల్ట్‌షాపులు ఉన్నాయని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధ, మాజీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో అసలు బెల్ట్‌షాపులే లేవన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తూ..బెల్ట్‌షాపుల ఫొటోలను షేర్ చేశారు. ఎక్స్ వేదికగా రోజా ఏమన్నారంటే.. అయ్యా చంద్రబాబు, లోకేష్.. మీరు నిబంధనలు ఉల్లంగించి వైన్ షాపులు ఏర్పాటు చేసింది వాస్తవం కాదా? రాష్ట్రంలో అసలు బెల్టు షాపులు లేవు, వాటి వల్ల ఎలాంటి ఘటనలూ జరగడం లేదని మీరు చెబుతున్నది పచ్చి అబద్ధాలు కావా? అవే అబద్ధాలను మీ వాళ్ల చేత ప్రచారం చేస్తున్నది నిజం కాదా? రాష్ట్రంలో బెల్టు షాపుల సంఖ్య 1,50,000లకు పైనే చేరుకున్నది వాస్తవం కాదా? మీరు చెబుతున్నది అబద్ధాలని చెప్పడానికి ఈ ఫోటోలు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? అంటూ ఆర్కే రోజా ప్రశ్నించారు.