కూట‌మి ఛార్జ్‌షిట్‌..ఛార్జింగ్  లేని పార్టీల కామెడీ షో 

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేత వాసిరెడ్డి పద్మ 

తాడేప‌ల్లి:  ఎన్‌డీఏ కూట‌మి వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌పై విడుద‌ల చేసిన ఛార్జ్‌షిట్ ఛార్జింగ్ లేని పార్టీలు చేస్తున్న కామెడీ షోలా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేత వాసిరెడ్డి పద్మ అభివ‌ర్ణించారు.  ఎన్నికలలో సింగిల్ గా పోటీ చేసే ధైర్యం లేని బిజేపి, టిడిపి, జనసేన పార్టీలు ఇవాళ ఛార్జీ షీట్ అంటూ హడావుడి చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. శుక్ర‌వారం వాసిరెడ్డి ప‌ద్మ మీడియాతో మాట్లాడారు.

  • ఛార్జీంగ్ లేని పార్టీలు కామెడీ షో చేస్తున్నట్లుగా ఛార్జిషీట్ విడుదల వ్యవహారం కనిపించింది.
  •  ప్రజలకు ఏమాత్రం ఆసక్తి లేని విషయం.
  • వైయ‌స్  జగన్ గారి ప్రభుత్వంపై అభాండాలు,అవాస్తవాలు,అసత్యాలతో ఛార్జిషీట్ రూపొందించారు. విడుదల చేసిన వారు దొంగల ముఠా లెక్కన కనిపిస్తున్నారు.
  •  దొంగలు అందరూ కలసి పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ కూటమి నేతలందరూ ఛార్జీషీట్ అంటూ మాట్లాడితే అంతే కామెడీగా ఉంటుంది.
  • ఏలేరు స్కామ్ నుంచి ప్రారంభిస్తే స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ ఐఎంజి భారత్ స్కామ్, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వ్యక్తి చంద్రబాబు.
  •  ఇవన్నింటిలోను నిందితుడైన చంద్రబాబు జగన్ గారి పాలనలో ఏవో కుంభకోణాలు జరిగాయని విమర్శలు చేయడం హాస్యాస్పదం.
  •  ఐదేళ్ల కాలంలో వైయ‌స్ జగన్ గారి పాలనలో ఒక్క కుంభకోణం జరిగిందని వేలెత్తి చూపలేకపోయారు.
  •  అవినీతి,కుంభకోణం  జరిగిందనేందుకు అవకాశం ఇవ్వని జగన్ గారిపై ఛార్జిషీట్ అంటూ వేయడం వేయడం ఏంటి.
  • మీ హయాంలో అవినీతిలో ఏపి నెంబర్ 1.ఆరోజున జాతీయ గణాంకాల రిపోర్ట్లన్నీ అవే చెప్పాయి.
  • అప్పులలో,అవినీతిలో నెంబర్ 1,దళితులలో దాడులలో నెంబర్ 4 ,మహిళ అక్రమరవాణాలో నెంబర్ 2, ఇది చంద్రబాబు ట్రాక్ రికార్డ్.
  • ఈ రకంగా ఏపిని చంద్రబాబు పాలనలో అంతగా దిగజార్చితే జగన్ గారు ఆర్దిక వృధ్దిరేటులో 22 నుంచి 1 వస్దానంలోకి తెచ్చారు.
  •  చంద్రబాబు ఏపిని అధోగతి పాలు చేస్తే జగన్ గారు ఒక్కొక్కరంగాన్ని వృధ్దిలోకి తీసుకువచ్చారు.
  • మీలాగా మేం కాకి లెక్కలు చెప్పడం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన గణాంకాలు చూస్తే ఇవే చెబుతాయి.
  •  వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నాడు.చంద్రబాబు వ్యవసాయం రంగంలో రాష్ర్టాన్ని 27 వస్దానంలో ఉంచితే జగన్ గారు ఆరో స్దానంలోకి తెచ్చారు.
  •  విద్య నాణ్యతా ప్రమాణాల విషయంలో 24 స్దానంలో చంద్రబాబు ఉంచితే జగన్ గారు 7 వ స్దానంలోకి తెచ్చారు.
  •  కోవిడ్ వ్యాక్షిన్ లను ప్రతి గడపకు తీసుకువెళ్లిన ఘనత జగన్ గారిది.దేశంలోనే ఏపి రెండో స్దానంలో నిలిచింది.
  • ఇది వైయ‌స్ జగన్ గారి పాలనకు చంద్రబాబు పాలనకు ఉన్న తేడా.
  • వైయ‌స్ జగన్ గారు కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి ఇంటి వద్దకు సంక్షేమపధకాలు అందిస్తున్నారు.
  • మీరు ఎలాగు ప్రజలకు మేలు చేయలేదు.మేలు చేసిన వైయ‌స్‌ జగన్ గారి పై ఏ ముఖం పెట్టుకుని ఛార్జి షీట్ వేస్తారు.
  • వైయ‌స్ జగన్ గారు 31 లక్షలమందికి ఇంటిస్దలాలు ఇచ్చారు.17 మెడికల్ కాలేజిలు నిర్మిస్తున్నారు.నాలుగు పోర్టులు,10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నారు. 
  • డ్వాక్రా రుణమాఫి అని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. 
  • గ్రామసచివాలయాలు,వాలంటీర్ల వ్యవస్దను తీసుకువచ్చి పరిపాలన ఇంటిముంగిటకు తీసుకువెళ్లారు.
  • వైయ‌స్ జగన్ గారి పరిపాలనను వేలెత్తి చూపే అర్హత టిడిపి కూటమికి ఏమాత్రం లేదు.
Back to Top