ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం

వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందని ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.  మంగళవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  ఒక పార్టీ అధ్యక్షురాలు  లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకొపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు..? అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుంది.  అదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పింది. కానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోంది. ఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారు. చంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్.. నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు? అని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు.  

 లేళ్ళ అప్పిరెడ్డి ఏమ‌న్నారంటే..

  • ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల కమిషన్ అంటే ఎంతో ప్రాధాన్యత కలిగింది. ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి నిష్పాక్షకంగా ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగం ఎన్నికల కమీషన్ కు అధికారం ఇచ్చింది.
  • దురదృష్టం ఏపిలో నేడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎన్నికల కమీషన్ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
  • ఒక పార్టీ అధ్యక్షురాలు ఉత్తరం రాస్తే అధికారులను బదిలీలు చేయడం,ఇంకో పార్టీ అధ్యక్షుడు ఉత్తరం రాస్తే ఈసి ఆన్ గోయింగ్ స్కీమ్స్ నిలిపివేస్తున్నారు.
  • రైతుల ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం ఆపేశారు. ఎన్నికల తర్వాత ఇస్తామని ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశంలో మనం చూసినట్లయితే తెలంగాణలో ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.అక్కడ అకాలవర్షాలు పడ్డాయి అక్కడి ఎన్నికల కమీషన్ ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఆదేశాలు ఇచ్చింది.
  • ఎందుకు ఈ వ్యత్యాసాలు.ఎన్నికల కమీషన్ ఓ నిర్ణయం తీసుకుంటే అది జమ్ము,కాశ్మీర్ లో అయినా,దేశంలో ఏ రాష్ర్టంలో అయినా ఒకే విధానం ఉంటుందని భావిస్తాం.పక్కనే ఉన్న తెలుగురాష్ర్టమైన తెలంగాణాలో ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చిన పత్రాలు ఇవి.
  • ఈ నెల 4 వతేదీన అనుమతి ఇచ్చారు.
  • అదే విధంగా ఏపిలో కూడా ఈసిని అనుమతి అడిగితే ఇవ్వడానికి వీలవదు ఎన్నికల తర్వాతనే ఇవ్వాలని చెప్పారు.
  • అక్కడా రైతులే..ఇక్కడా రైతులే సమస్య ఒక్కటే అయినా ఎన్నికల కమీషన్ నిర్ణయాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి.
  • విద్యాదీవెన పధకం విషయంలో కూడా 5 వతేదీన ఇప్పుడు లబ్దిదారుల ఖాతాలలో వేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చారు.కమీషన్ ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో అర్దం కావడం లేదు.
  • చేయూత పధకం విషయం కూడా అదే వైఖరి కనిపిస్తోంది.
  • పేదలకు అందించే ఆన్ గోయింగ్ పధకాల లబ్దిని లబ్దిదారులకు చేరకుండా నిలిపివేయడం సరైనవిధానం కాదు.
  • చేయూత,రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ,విద్యాదీవెన పధకాలకు నగదు బదిలీ ఇప్పుడు చేయవద్దని ఈసి చెప్పిందని దీనిపై ఎన్నికల కమీషన్ పునరాలోచన చేయాలి.
  • ఇవి ఎన్నికల కోసం,ఓట్ల కోసం పెట్టిన పధకాలు కావనేది ప్రతి ఒక్కరికి తెలుసు.
  • ఆన్ గోయింగ్ పధకాలను అడ్డుకోవడం దుస్సంప్రదాయం అవుతుంది.
  • వీటన్నింటికీ కారణం చంద్రబాబు.ఆయనకి వ్యవస్థలను మేనేజ్ చేయడం మొదటినుంచి అలవాటు,పెన్షన్స్ ఇచ్చే వాలంటీర్ వ్యవస్థను ఆపేసాడు వృద్ధుల మరణానికి కారణం అయ్యాడు.
  • చంద్రబాబు ఆలోచనలు పేదవాడిని దెబ్బ తీసే విధంగా ఉంటాయి.ప్రజలు గమనించాలి.
  • సమాజంలో ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీలు,అగ్రవర్ణాలలోని పేదలకు ఏ విధమైన మేలు జరగకూడదనే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.ప్రజలు కూడా చంద్రబాబు ఆలోచనలను గ్రహించాలి.
  • చంద్రబాబు కూటమిలో చేరిన తర్వాతనే ఈ విధమైన నిర్ణయాలు జరుగుతున్నాయి.
  • రాష్ర్టంలో పేదవర్గాల ప్రజలంతా రోడ్లపైకి వస్తున్నారు.ఎన్నికల కమీషన్ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు.
  • రోజు రోజుకి ఎన్నికల కమిషన్ మీద విశ్వసనీయత నశిస్తోంది. చంద్రబాబు ట్రాప్ లో ఎన్నికల కమిషన్ పడకూడదు అని కోరుకుంటున్నాను.అతని నైజమే వెన్నుపోట్లు.
  • కమీషన్ నిష్పాక్షికంగా వ్యవహరించాలని వైయస్సార్సిపి విజ్ఞప్తి చేస్తోంది.
  • పవన్ కల్యాణ్,చంద్రబాబు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి పదే పదే అబద్దాలు చెప్పారు..నిన్న మోడీ ముందు ఎందుకు మాట్లాడలేదు.విలువలు లేని నాయకుడు చంద్రబాబు.
  • మీకు సిధ్దాంతం,విధానాలు లేవు,విలువలు లేవు మోది ఉంటే ఒకలాగా,ఆయన లేకపోతే మరొకలాగా వ్యవహరిస్తారు.
  • చంద్రబాబూ నీవు ఎల్లకాలం అడ్డుకోలేవు.ఈ నాలుగురోజులు మాత్రమే నీ ఆటలు సాగుతాయోమే.
  • 130 సార్లు బటన్ నొక్కి జగన్ పేదల ఖాతాలలో నిధులు జమ చేసాడు. దానిని ప్రజలు మర్చిపోరు.
  • రేపు 13 వతేదీన ప్రజలు అసెంబ్లీకి,పార్లమెంట్ కు రెండు బటన్స్ నొక్కి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వైయస్ జగన్ ను గెలిపించాలి. ప్రజలు టీడీపీకి బుధ్ది చెప్పడం ఖాయం.ఆ పార్టీ గొంతు నొక్కడం ఖాయం.
  • ఈ సమయంలో బదిలీలు చేయడంతో అధికారులు మనో ధైర్యం కోల్పోయే అవకాశం ఉంది.
  • ఎన్నికల కమీషన్ నిర్ణయాలపై ప్రజలు కోర్టులకు వెళ్తున్నారు.
  • పోలవరం జాతీయప్రాజెక్టు ఆ ప్రాజెక్టును ఏటిఎంలాగా వాడుకుంది చంద్రబాబే.పోలవరం ప్రాజెక్టు అనేది వైయస్సార్ కల.ఆ కలను నెరవేర్చేది వైయస్ జగన్ అనేది గుర్తుంచుకోవాలి.ఈ విషయంలో చంద్రబాబు మాటలను ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదు.
Back to Top