ఓటు అనే అస్త్రంతో బాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలి

ఇచ్చాపురం ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు

59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ. 2లక్షల 70 వేల కోట్లు అందించాం

2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం

మేనిఫెస్టోని 99 శాతం హామీలను నెరవేర్చాం

నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం

3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు 

విద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?

అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ,చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం

అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం

అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్‌

ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు

సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం

విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం

గ్రామస్థాయిలోనే రైతులను చేయి పట్టుకొని నడిపించే ఆర్‌బీకే వ్యవస్థ

స్వయం ఉపాధికి అండగా వాహనమిత్ర, నేతన్న నేస్తం,మత్స్యకార భరోసా

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచాం.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాం

మూడు జిల్లాలను ఆరు జిల్లాలను చేశాం

ఎగ్జిక్యూటివ్‌క్యాపిటల్‌గా విశాఖనుఉద్దాన సమస్యను పరిష్కరించాం

కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం

జూన్‌ 4న మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు

మీ బిడ్డ అధికారంలో వెంటనే మళ్లీ మొత్తం అందిస్తాం

దోచేసిన సొమ్ముతో చంద్రబాబు ఓటర్లను ప్రలోభపెడతాడుబాబు డబ్బులిస్తే తీసుకోండి.. కానీ ఓటేసే ముందు ఆలోచించండి.

ఎవరి వల్ల మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి.

మీరు వేసే ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 శ్రీ‌కాకుళం: సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నార‌ని, ఓటు అనే అస్త్రంతో ఆయ‌న‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశాడని దుయ్యబట్టారు. బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. ఈ పథకాలకు బడ్జెట్‌లో ఆమోదం కూడా తెలిపామని తెలిపారు. పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్నామ‌ని, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, భోగాపురం ఎయిర్‌పోర్టు విస్తరన పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్‌ కాలేజీలు కడుతున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ కనెక్టవిటీ పెంచామని అన్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం వైయ‌స్ జగన్‌  భారీ బహిరంగ సభ నిర్వహించారు.  

ఈ సందర్భంగా  సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే.

ఇచ్ఛాపురం సిద్ధమా? 

చిక్కటి చిరునవ్వులతో ఇంతటి ప్రేమానారాగాలు, ఆప్యాయతలు, ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకు, తాతకు, నా ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ... మీ అందరి ప్రేమాభిమానాలకు మీ జగన్... మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు,పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు.

మునుపెన్నడూ లేని విధంగా డీబీటీ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు జమ.
దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ 59 నెలలకాలంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ జరగనివిధంగా, ఆంధ్రరాష్ట్రం ఎప్పుడూ చూడనివిధంగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల తర్వాత ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు.. మరొక్కసారి చెబుతున్నా ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనివిధంగా వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలకు ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే, వారి చేతికే ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా మీబిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే, వారి చేతికే ఇలా పోతోంది.అక్కా నేను మిమ్మల్నే అడుగుతున్నా.. పెద్దమ్మ నిన్నే అడుగుతున్నా, అన్నా మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే నేరుగా వెళ్లిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
 

మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే.
ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా, గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మేనిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి 99 శాతం హామీలు అమలు చేసి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఇంటికే ఆ మేనిఫెస్టోను పంపించి అక్కా మీరే టిక్ పెట్టండి మీబిడ్డ పాలనలో ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చి మళ్లీ మీ దగ్గరకు వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మళ్లీ మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాము అని మొట్టమొదటిసారిగా రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ జరగనివిధంగా మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చింది కేవలం ఈ 59 నెలలకాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అని మీ బిడ్డ అడుగుతున్నాడు .

ప్రభుత్వ విద్యలో విప్లవం...
ఇప్పుడు నేను గడగడ గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాను. అవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎవరైనా చూశారా? ఎవరైనా చేశారా? అన్నది మీరే ఒక్కసారి ఆలోచించండి అని మిమ్మల్నే కోరుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల్లోనే నాడు-నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాసుల్లో డిజిటల్ బోధన, 8వ తరగతికి వచ్చేసరికి పిల్లాడి చేతిలో ట్యాబ్‌లు, ఇంగ్లీష్ మీడియంతో మొదలుపెడితే 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం, గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా పిల్లల చేతుల్లో ఈరోజు మొట్టమొదటిసారిగా బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక ఇంగ్లీష్ పక్క పేజీ తెలుగుతో మొట్టమొదటిసారిగా ఈరోజు మన పిల్లలు చేతుల్లో కనిపిస్తున్నాయి. బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక, బడులల్లో పిల్లలకు గోరుముద్ద, బడులు తెరిచేసరికే ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపేట్టుగా గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం, పిల్లల చదువులకు ఏ తల్లి ఇబ్బంది పడకుండా ఆ పెద్ద చదువులకు సైతం ఆ తల్లిదండ్రులకు, ఆ అక్కచెల్లెమ్మలకు, ఆ పిల్లలకు తోడుగా ఉంటూ పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల్లో ఇంటర్నేషనల్ యూనివర్శిటీస్ హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, ఎల్ఎస్ఈ వంటి ఇంటర్నేషనల్ యూనివర్శిటీల కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి వారి చేత సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం, మొట్టమొదటిసారిగా మన డిగ్రీల్లో, మన కోర్సుల్లో మేండేటరీ ఇంటర్న్ షిప్.. నేను అడుగుతున్నా ఇవన్నీ గతంలో ఈ చదువుల విప్లవాలు గతంలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.అక్కా జరిగాయా? తమ్ముడూ జరిగాయా? అన్నా జరిగాయా?.

అక్కచెల్లెమ్మలకు అండగా...
అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద తాము నిలబడేట్టుగా ప్రతి అక్కచెల్లెమ్మ కూడా తన ఇంటిని తాను నడిపే పరిస్థితిలోకి రావాలని ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ అక్కచెల్లెమ్మలకు ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ, ఓ చేయూత, కాపునేస్తం,ఈబీసీనేస్తం,31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నా అక్కచెల్లెమ్మల పేరిటే చేస్తూ, అందులో ఏకంగా మరో 22 లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టిన పరిస్థితి. నేను అడుగుతున్నా ఈరోజు మీబిడ్డగా ఇంతకుముందు ఎప్పుడైనా కూడా అక్కచెల్లెమ్మలకు ఇంతగా తోడుగా ప్రభుత్వం ఇన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఏం అక్కా గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఓ ఆసరా ఉందా? ఓ చేయూత ఉందా? ఓ సున్నావడ్డీ ఉందా?.

అవ్వాతాతలకు అండగా నిలబడిన ప్రభుత్వం.
అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, అవ్వాతాతల కష్టాన్ని ఎవరైనా కూడా పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే. అవ్వాతాతల ఇంటికే నేరుగా రూ.3 వేల పెన్షన్,అవ్వాతాతల ఇంటివద్దకే పౌర సేవలు, ఆ ఇంటి వద్దకే పథకాలు, ఆ ఇంటి వద్దకే రేషన్.. నేను అడుగుతున్నాను ఇలా ఇంటి వద్దకే పెన్షన్, ఇంటివద్దకే రేషన్, ఇంటివద్దకే పౌర సేవలు, ఇంటివద్దకే పథకాలు నేరుగా తలుపుతట్టి మీ దగ్గరికే వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా?. జరిగాయా అక్కా? జరిగాయా పెద్దమ్మ? జరిగాయా తమ్ముడు?.

రైతులను చేయిపట్టుకుని నడిపిస్తూ.
రైతన్నను మొట్టమొదటిసారిగా చేయి పట్టుకుని నడిపిస్తూ వారికి పెట్టుబడికి సహాయంగా ఓ రైతుభరోసా, ఆ రైతన్నకు తోడుగా ఉంటూ  ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగానే  ఇన్‌పుట్ సబ్సిడీ, పగటిపూటే9 గంటలపాటు ఉచిత విద్యుత్, గ్రామంలోనే రైతన్నల చేయి పట్టుకుని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ.. నేను అడుగుతున్నాను.. రైతన్న కొరకు ఏదైతే చెప్పానో అవన్నీ చేసి చూపించిన పరిస్థితిలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ
ఆటో డ్రైవర్ అన్నలకు, ట్యాక్సీ డ్రైవర్ అన్నలకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులకు మత్స్యకారభరోసా, చిరువ్యాపారులకు, శ్రమ జీవులకు అండగా ఓ తోడు, ఓ చేదోడు,చివరికి లాయర్లకు కూడా లా నేస్తం.. ఇలా స్వయం ఉపాధికి ఇంతగా తోడుగా ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 
 

వైద్యం కోసం పేదవాడు అప్పుల పాలవ్వకూడదని...
పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడు పోకూడదు అని రూ.25 లక్షల దాకా విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఆ పేదవాడికి తోడుగా ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఓ ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికీ వచ్చి జల్లెడ పడుతూ ఓ ఆరోగ్య సురక్ష.. నేను అడుగుతున్నా ఇంతగా పేదవాడి ఆరోగ్యంపట్ల ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా? అని మీబిడ్డ అడుగుతున్నాడు .

వీటన్నింటికీ తోడు ఏ గ్రామానికి వెళ్లినా కూడా 600 రకాల సేవలు అందిస్తున్న ఓ గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉన్నాయి. అదే గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ, అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు వేస్తే ఓ విలేజ్ క్లినిక్, అదే గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే అక్కడే నాడు-నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే మన గ్రామంలోనే కనిపిస్తుంది. గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్, అదే గ్రామంలో ఉన్న నా అక్కచెల్లెమ్మ ఎక్కడికివెళ్లినా ధైర్యంగా వెళ్లేట్టుగా ఆ అక్కచెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్.. మీ బిడ్డ అడుగుతున్నాడు ఇంతగా ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా?.


  

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సైతం.
ఇంతవరకు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగనివిధంగా చేసిన మార్పుల గురించి మీతో పంచుకున్నాను. ఇదే ఉత్తరాంధ్రను తీసుకుందాం. ఇదే ఉత్తరాంధ్రలోనే.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏవేం చేశామో కూడా మీ బిడ్డ నాలుగు మాటల్లో మీఅందరితోనూ కూడా పంచుకుంటాడు. 3 జిల్లాలను 6 జిల్లాలు చేసింది, ముగ్గురు కలెక్టర్లు, ముగ్గురు ఎస్పీలు ఉండాల్సినచోట ఆరు మంది కలెక్టర్లను, ఆరు మంది ఎస్పీలతో పరిపాలన వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరకు తీసుకొచ్చింది ఈ 59 నెలల మీబిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతున్నాడు. మూడు రాజధానుల్లో.. ఉతరాంధ్రలోని మన విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేయడంతో పాటు, జూన్ 4వ తేదీన విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తూ, ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నంను చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని ఈ సందర్భంగా గర్వంగా చెబుతున్నాను.
 

ఉద్దానం మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా, గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఏకంగా రూ.4,400 కోట్లతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతున్నాయంటే కారణం మీబిడ్డ కాదా అని అడుగుతున్నాడు. ఇదే శ్రీకాకుళంలోనే బుడగట్లపాలెం మంచినీళ్లపేటలో 2 ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి. పూడిమడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తోంది, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నాం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ కనిపిస్తున్నాయి. భోగాపురం నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి భోగాపురానికి పోయేందుకు ఆరు లైన్ల రహదారిని కూడా నిర్మించబోతోంది మీ బిడ్డ పాలనలోనే. అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైంది కూడా మనందరి ప్రభుత్వంలోనే. దశాబ్ధాలుగా ఉన్న సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే ఉద్దానం సమస్య. దశాబ్ధాలుగా ఉంది ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్కరంటే ఒక్కరూ ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసిన పుణ్యం కట్టుకోలేదు. ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా రూ.780 కోట్లు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేజ్ వాటర్ తీసుకొచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికి అంతా కూడా నీళ్లు తేవాలి, ఇవ్వాలి, చేయాలి అని దానికి ఫౌండేషన్ వేసింది, పూర్తి చేసింది మీబిడ్డ కాదా అని అడుగుతున్నాడు. 

ఏకంగా రూ.80 కోట్లతో కిడ్నీ ఆస్పత్రి రీసెర్చ్ సెంటర్ కు కూడా పునాది వేసింది, ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసింది కూడా మీబిడ్డ కాదా అని ఈ సందర్భంగా  అడుగుతున్నాడు . కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ 59 నెలలకాలంలో 4 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ఈ 4 మెడికల్ కాలేజీల్లో 3 పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. నాలుగోది మన విజయనగరంలో మెడికల్ కాలేజ్ వస్తోంది. మొట్టమొదటిసారిగా జేఎన్టీయూ విజయనగరంలో యూనివర్శిటీని చేసింది మనందరి ప్రభుత్వమే. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నది మన ప్రభుత్వమే. కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజ్ కడుతోంది కూడా మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఏకంగా 5 మల్టీ స్పెషాలిటీ ఈరోజు వేగంగా పనులు జరుగుతున్నాయంటే ఇది మీబిడ్డ పాలనలో కాదా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. మారుమూల ఉండిపోయిన గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు కూడా లేని పరిస్థితి, సెల్‌ఫోన్ కనెక్టివిటీ కూడా లేనిచోట ఏకంగా 400 టవర్లు రూ.400 కోట్ల వ్యయం చేసి ఈరోజు ఎవ్వరూ పోనీ ఆ గిరిజన ప్రాంతాలకు సెల్‌ఫోన్ల ద్వారా కనెక్టివిటీ కూడా ఇచ్చింది ఈ 59 నెలలకాలంలోనే అని గర్వంగా చెబుతున్నాను. 

గిరిజనులకు మంచి చేస్తూ ఏకంగా లక్షా 53 వేల కుటుంబాలకు మంచి జరిగిస్తూ... ఏకంగా 3 లక్షల 23 వేల ఎకరాలను ఆర్వోఎఫ్ఆర్ పట్టాల కింద, డీకేటీ పట్టాల కింద ఇవ్వడమే కాకుండా వాళ్లందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ రైతుభరోసా సొమ్మును కూడా ఇస్తూ వాళ్లందరికీ కూడా జీవనోపాధి చూపిస్తున్న ప్రభుత్వం కూడా మీబిడ్డ పాలనలోనే జరిగింది అని గర్వంగా చెబుతున్నాడు. మొత్తంగా విద్యారంగంలో, వైద్యంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి కుటుంబాన్ని కూడా శాశ్వతంగా ఉపయోగపడే పదికాలలపాటు ఉపయోగపడే అభివృద్ధికి బాటలు వేస్తుంది రాబోయే రోజుల్లో అని చెబుతున్నాను. ప్రతిఒక్కరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈరోజు నుంచి ఒక 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను.

ఈరోజు నుంచి ఒక 15 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈరోజు ఒకటో తరగతి చదువుతున్న మన పిల్లాడు ఐబీ సిలబస్‌తో, ఇంగ్లీష్ మీడియంతో, 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాసులతో, 8వ తరగతి నుంచి ట్యాబులతో ఆ పిల్లాడు బయటికొస్తాడు. 2035లో ఆ పిల్లాడు ఐబీ పరీక్షలు రాస్తూ ఐబీ సర్టిఫికెట్ తో బయటికొస్తాడు. వచ్చిన ఆ పిల్లాడు మరో నాలుగేళ్లలో డిగ్రీ పూర్తి చేస్తాడు, ఆ డిగ్రీలల్లో కూడా 30 నుంచి 40 పర్సెంట్ కోర్సులు ఏ హార్వర్డో, ఎల్ఎస్ఈ, స్టాన్ ఫర్డో ఇటువంటి ప్రఖ్యాత యూనివర్శిటీస్ నుంచి ఆన్ లైన్ ద్వారా వాళ్ల చదువులు వాళ్ల సర్టిఫికెట్లు వాళ్ల కోర్సులు వాళ్ల చేత సర్టిఫై చేసిన కోర్సులతో డిగ్రీ పుచ్చుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత బయటకి వచ్చే ఈ పిల్లాడు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలకు, మల్టీ నేషనల్ కంపెనీలకు ఆ పిల్లాడు ఉద్యోగాల కొరకు అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని సవినయంగా కోరుతున్నాను. 

మరోవంక చూడండి... చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అని అంటాడు, 3 సార్లు సీఎంగా చేశానని అంటాడు. నేను అడుగుతున్నా ఇన్ని వేలమంది ఇక్కడే ఉన్నారు నేను అడుగుతున్నాను. కాసేపటి క్రిందట నేను అడిగాను. ఇవన్నీ ఎప్పుడైనా గతంలో చూశారా అని మీబిడ్డ అడిగాడు. ఇదేమాదిరిగా నేను అడుగుతున్నా ఇన్నివేలమంది ఇక్కడున్నారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు, 3 సార్లు సీఎంగా ఉన్నానని చెబుతున్న ఈ చంద్రబాబు పేరు చెబితే ఇక్కడున్న ఏ ఒక్కరికైనా ఏ పేదకైనా కూడా తన పేరు చెబితే తానుచేసిన ఒక్క మంచైనా ఉందా అని అడుగుతున్నాడు మీబిడ్డ. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి ఆ చంద్రబాబు పేరుచెబితే ఈ పేదకైనా గానీ గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతున్నాడు మీబిడ్డ. చంద్రబాబు పేరు చెబితే 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఏ పేదకు కూడా తాను చేసిన ఒక్క మంచి గానీ, తాను చేసిన ఒక్క స్కీమ్ గానీ గుర్తుకు రావడంలేదంటే ఆయన ఏ స్థాయిలో ప్రజలను మోసం చేస్తూ పరిపాలన చేశాడు అన్నదానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 
 

అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు.. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూపమంటారా?  ఇది 2014 గుర్తుందా ఈ పాంప్లెట్. అన్నా గుర్తుందా? తమ్ముడు గుర్తుందా? అక్కా 2014.. 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి.. సొంతంగా సంతకం పెట్టి ఇదే చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఈ పాంప్లెట్‌లో ఆయన చెప్పినవి ఒకసారి చదువుతా మీరే చెప్పండి 2014లో చంద్రబాబును నమ్మి మనం ఓటు వేస్తే ఆ తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని మిమ్మల్నే అడుగుతున్నా మీరే సమాధానం చెప్పండి.

ఈయన చెప్పినది.. ముఖ్యమైన హామీ అంటూ మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్‌లో ఈయన రాసినది మీకు చెప్పినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతున్నా రూ.87,612 కోట్ల రైతుల రుణమాఫీ జరిగిందా? రెండో హామీ పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేస్తానన్నాడు. నా అక్కచెల్లెమ్మలను అడుగుతున్నాను, నా అక్కచెల్లెమ్మల కుటుంబసభ్యులను అడుగుతున్నా.. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా?

మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతున్నాను. ఆయన 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రి ఇన్నివేల మంది ఇక్కడున్నారు మీలో ఒక్కరి అకౌంట్లోనైనా కూడా ఒక్క రూపాయి డిపాజిట్ చేశాడా అని అడుగుతున్నాడు మీబిడ్డ.
ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి నెలనెలా అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, అంటే రూ.1.20 లక్షలు ఇందులో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నా మూడు సెంట్లు స్థలం కథ దేవుడెరుగు, కట్టుకునేందుకు కనీసం ఒక్క సెంటు స్థలమైనా కూడా ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? 

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలుమాఫీ అన్నాడు. జరిగాయా?. 
ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా?. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా ? మన ఇచ్ఛాపురంలో కనిపిస్తోందా ? మరి నేను అడుగుతున్నా. ఈ మాదిరిగా సంతకం పెట్టి ముగ్గురి ఫొటోలు వేసి మీ ప్రతి ఇంటికి పంపించిన పాంప్లెట్‌లో చెప్పినవి  ఆ తర్వాత ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ వ్యక్తి చేయకపోతే ఇలాంటి వ్యక్తులను నమ్మవచ్చా? అని నేను మిమ్మల్నే అడుగుతున్నాను. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదీ అమ్మేశారు. మళ్లీ ఇదే ముగ్గురు, మళ్లీ ఇదే చంద్రబాబు మళ్లీ ఈరోజు మేనిఫెస్టో డ్రామా అంటున్నారు. సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? అన్నా నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా అన్నా? నమ్ముతారా అక్కా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ బెంజి కార్ కొనిస్తారట నమ్ముతారా తమ్ముడూ? అందరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తున్నాను. 

ఈరోజు మీ అందరితో కూడా ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాలి. ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతున్నా. ఈరోజు ఎన్నెన్ని అబద్ధాలు జరుగుతున్నా, ఎన్నెన్ని మోసాలతో మనం యుద్ధం చేస్తున్నామో గమనించమని అడుగుతున్నా. మాములుగా ఏ ప్రభుత్వమైనా కూడా ఎన్నుకోబడేది 60 నెలలపాటు ఎన్నుకునేందుకు 60 నెలలపాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు. 5 సంవత్సరాలపాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ 60 నెలలు కూడా కాకముందే 57 నెలలు వచ్చేసరికే అటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు జరుగుతోంది. అవ్వాతాతలకు ఇంటికే ఇచ్చే పెన్షన్‌ను దగ్గరుండి అడ్డుకున్నారు. అంతటితో ఆగిపోకుండా మీబిడ్డ ఏదైతే బటన్లు నొక్కాడో ఏదైతే 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ప్రతి నెలా ప్రతి సంవత్సరం ఆయా పథకాలకు మీబిడ్డ ఏదైతే బటన్లు నొక్కుతూ వస్తున్నాడో ఏవైతే ఆన్‌గోయింగ్ స్కీమ్స్ గా ఉన్నాయో ఏదైతే బడ్జెట్ అలకేషన్ జరిగిందో ఇటువంటి పథకాలను కూడా కేవలం మీబిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీబిడ్డ బటన్లు నొక్కాడు అని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతోంది అంటే వాటిని కచ్చితంగా జరిగించండి అని చెప్పి మీబిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తున్నాడు అంటే ఒక్కసారి గమనించండి. నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయ్, ఏ స్థాయిలో వీళ్లు దుర్బుద్ధి పని చేస్తుందో అని అడుగుతున్నాను. 

మీ అందరికీ ఒక్కటే ఒక్క విషయం చెబుతున్నాను. ఇన్ని సంవత్సరాలు మీబిడ్డ బటన్లు నొక్కుతున్నాడు, ప్రతి అవ్వాతాత ఇంటికే పెన్షన్ సొమ్ము మీ బిడ్డ ఇంటికే పంపిస్తున్నాడు. మరి పెన్షన్ సొమ్ము ఇన్ని నెలలపాటు మీబిడ్డ పంపించిన తర్వాత చివరి రెండు నెలలు పెన్షన్ సొమ్ము అవ్వాతాతల ఇంటికి రాకపోతే ఆ అవ్వాతాతలకు అర్థం కాదా? ఈ కుట్రలు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతున్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబును అడుగుతున్నాను.
ఇదే అక్కచెల్లెమ్మలకు కూడా చెబుతున్నా. ఇదే అక్కచెల్లెమ్మలకు అర్థంకాదా? ఇన్ని సంవత్సరాలపాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ల బిడ్డ బటన్లు నొక్కుతున్నాడు అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటున్నాడు. మరి చివరికి వచ్చేసరికే చివరి రెండునెలలు మీ బిడ్డ బటన్లు నొక్కుతున్నా కూడా అక్కచెల్లెమ్మలకు రాకుండా అడ్డుతగులుతున్నవాళ్లను ఎవరు చేస్తా ఉన్నారు అని అక్కచెల్లెమ్మలకు అర్థం కాకుండా ఉంటుందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  

మీరు వేసే ఓటు అనే ఆయుధంతో ఢిల్లీ పీఠం కదులుతుంది. 
ఇవాళ ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే.. వీళ్లు ఎన్ని కుట్రలు చేసిన, వీళ్లు కుతంత్రాలు చేసిన పైన మాత్రం దేవుడు ఉన్నాడన్న సంగతి మాత్రం వీళ్లెవరూ కూడా మర్చిపోకూడదని చెబుతున్నాను. ప్రజల ప్రేమ ఉంది, ప్రజల దీవెనలు ఉన్నాయి, జరుగుతున్న కుట్రలు ప్రతిఒక్కరూ కూడా ప్రతి అక్కచెల్లెమ్మ కూడా ప్రతి అవ్వాతాత కూడా గమనిస్తూనే ఉంటారు. ఓటు అనే ఆయుధం నా అక్కచెల్లెమ్మల చేతుల్లో ఉంది. నా అవ్వాతాతల చేతుల్లో ఉంది. నా రైతన్నల చేతుల్లో ఉంది. ఓటు అనే ఆయుధంతో వీళ్లను కొట్టబోయేదెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుంది అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెబుతున్నాను. ఆలోచన చేయమని చెబుతున్నా. ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయ్, ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతోందని. ప్రతి అక్కచెల్లెమ్మకు చెబుతున్నా, ప్రతి అవ్వకు చెబుతున్నా మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో మీబిడ్డ కేవలం బటన్లు నొక్కుతున్నాడు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయడం కోసం అడుగులు వేస్తున్నాడు. ఏకంగా మీబిడ్డ 2 లక్షల 70 వేల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పంపించాడు. కానీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏరోజూ బటన్లు నొక్కలేదు, ఏ రోజూ నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయడానికి అడుగులు వేయలేదు. కాబట్టే ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి. ఓటు రూ.2 వేలు ఇస్తాడు, ఓటుకు రూ.3 వేలు ఇస్తాడు అవసరమైనచోట ఓటుకు రూ.4-5 వేలు కూడా ఇచ్చే సామర్థ్యం చంద్రబాబుకు ఉంది. కానీ నేను మీ అందరికీ ఒకటే చెబుతున్నా. చంద్రబాబు ఇచ్చేది కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు ఇస్తాడు. ఆ తర్వాత మాత్రం ఎప్పుడూ చంద్రబాబు ఇవ్వడు. కానీ మీ జగన్ మాత్రం మీ బిడ్డ మాత్రం ముందే క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇస్తున్నామో, ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నామో అని ఆ పథకం పేరు చెప్పి మీబిడ్డ ఆ పథకాలన్నీ కూడా ఈ 59 నెలల్లో ఏ సంవత్సరం కూడా తప్పకుండా మీ బిడ్డ ఇచ్చాడు. కోవిడ్ వచ్చినా కూడా, రాష్ట్ర ఆర్థిక వనరులు ఇబ్బందులు పడినా కూడా, ఖర్చులు పెరిగినా కూడా, రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రాకపోయినా కూడా మీ బిడ్డ ఏ రోజూ సాకులు చూపలేదు. మీబిడ్డ మాత్రం నా అక్కచెల్లెమ్మలకే మంచి జరగాలని బటన్లు నొక్కడంలో ఏరోజూ కూడా మీబిడ్డ వెనకడుగు వేయలేదు. అందుకే మీఅందరికీ చెబుతున్నా.. చంద్రబాబు ఒకవేళ డబ్బులిస్తే డబ్బులు తీస్కోండి. ఏ ఒక్కరూ వద్దు అనొద్దు. ఎందుకంటే ఆ డబ్బు మనదే.. ఆ డబ్బు మనదే. మీ జగన్ బటన్లు నొక్కాడు, చంద్రబాబు బటన్లు నొక్కకుండా ఆ డబ్బును దోచేసికుని పంచేసుకున్నాడు. కాబట్టి చంద్రబాబు డబ్బులిస్తే ఎవ్వరూ వద్దని అనొద్దు, తీస్కోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది ప్రతిఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. 

ఈ రెండు విషయాలు కూడా మీఅందరికీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నా పక్కన ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులును ... జోడించి పేరుపేరున్నా ప్రార్థిస్తున్నాను. ఢిల్లీ పీఠం కదలాలి, ఢిల్లీ పీఠం కదలాలి అంటే శ్రీకాకుళం నుంచి అడుగులు పడాలి అన్నది మెసేజ్ ఇక్కడ నుంచి పంపించాలి అని మీ అందరినీ కూడా కోరుతున్నాను. 
 
సెలవు తీసుకునేమందు ఒక్కసారి మన గుర్తు ఇక్కడో, ఎక్కడో, అక్కడో మనగుర్తు తెలియనివాళ్లు ఎవరైనా ఉన్నా కూడా, మర్చిపోయున్నా కూడా పెద్దమ్మ అక్కడున్న అవ్వా మన గుర్తు ఫ్యాను, అక్కడ పచ్చచీర కట్టుకున్న అవ్వ మన గుర్తు ఫ్యాను, అక్కా మన గుర్తు ఫ్యాను, చెల్లెమ్మ మన గుర్తు, అన్నా మన గుర్తు, తమ్ముడు మన గుర్తు ఫ్యాను.. మంచి చేసిన ఫ్యాను ఎక్కడ ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి సింక్ లోనే ఉండాలి అంటూ ముఖ్యమంత్రి శ్రీ.వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top