వెంకుపాలెంలో ముళ్లమూరి వెంకటేశ్వర్లు విగ్రహ ఆవిష్కరణ

నివాళుల‌ర్పించిన దర్శి ఎమ్మెల్యే  డా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

 
ప్ర‌కాశం జిల్లా: కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండలం వెంకుపాలెం గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు ముళ్లమూరి వెంకటేశ్వర్లు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయస్ఆ ర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముళ్లమూరి వెంకటేశ్వర్లు పార్టీ బలోపేతం కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి, పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి యువ నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన నాయకుల సేవలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, మాజీ పీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మాదాసు వెంకయ్య పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముళ్లమూరి వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

Back to Top