శాసనమండలిలో వైయ‌స్ఆర్‌సీపీ సభ్యుల ఆందోళన 

అమరావతి: శాసనమండలిలో వైయ‌స్ఆర్‌సీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. ఇందాపూర్‌ డెయిరీ పేరుతో హెరిటేజ్‌ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చకు వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు డిమాండ్‌ చేశారు. గోవిందా గోవిందా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఛైర్మన్‌ పోడియం వద్ద ప్లకార్డులతో వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైయ‌స్ఆర్‌సీపీ సభ్యుల ఆందోళనలతో మండలి వాయిదా పడింది.

ఆల‌స్యంగా స‌మావేశాలు ప్రారంభం
అసెంబ్లీ చరిత్రలోనే అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని రీతిలో గంట ఆలస్యంగా అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 9 గంటలకు బదులు 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గంట ఆలస్యంగా మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అవ్వగానే వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. 10 గంటలకు ప్రారంభిస్తామని డిప్యూటీ స్పీకర్‌ ప్రకటించారు. ఆలస్యానికి కారణాలపై ప్రభుత్వం స్పష్టత నివ్వలేదు. 

 

Back to Top