తూర్పు గోదావరి జిల్లా: కిర్లంపూడిలోని నివాసంలో రాష్ట్ర వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పార్టీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి ముద్రగడ గిరిబాబును కూడా నాయకులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి , అనకాపల్లి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ , విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , మాజీ ప్రభుత్వ విప్, యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడా ప్రసాద్ పాల్గొని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాష్ట్ర పరిస్థితులు , పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది.