తాడేపల్లి: సీనియర్ జర్నలిస్ట్ టికె లక్ష్మణ్ రావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మణ్ రావు గారు పలు దినపత్రికలలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తూ విలువైన సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు అని అన్నారు. లక్ష్మణ్ రావు గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.