భూములిచ్చిన రైతుల పిల్లలకు స్థానికంగా ఉద్యోగాలు

సోలార్  పార్క్ విషయంలో మంత్రి వివరణ

 

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోలార్ పార్క్ గురించి అడిగిన ప్రశ్నలకు విద్యుత్ శాఖా మంత్రి బాలినేని సమాధానం ఇచ్చారు. 
సోలార్ పార్క్ కోసం శకునాల గ్రామంలో 1727 ఎకరాలు ప్రభుత్వ భూమి, 1879 ఎసైన్డ్ భూమి, 148 పట్టా భూమి, 25 ఎకరాల ఎండోమెంట్ భూమి మొత్తం కలిపి 2981 ఎకరాల భూమి ప్రభుత్వం సేకరించిందన్నారు.
అలాగే గని గ్రామంలో ప్రభుత్వ భూమి 1630 ఎకరాలు, 637 ఎకరాల ఎసైన్డ్ భూమి, 319 ఎకరాల పట్టా భూమి మొత్తంగా 2587 ఎకరాలు సేకరించినట్టు చెప్పారు.
రైతులకు అందించాల్సిన ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని జిల్లా కలెక్టర్ వద్ద జమచేసామని తెలిపారు. త్వరలో భూములిచ్చిన రైతుల పిల్లలకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించేందుకు, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు అధికారులతో, ఎమ్మెల్యేతో చర్చిస్తామని సమాధానమిచ్చారు.  

Read Also: చంద్రబాబు హయాంలో ఒక్కటైనా తెలుగు మీడియం స్కూల్‌ పెట్టారా? 

Back to Top