చంద్రబాబువి దొంగ ఏడుపులు..చిల్లర రాజకీయాలు

విపత్తును కూడా ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు

కేంద్ర మంత్రి ఏదైనా మాట్లాడొచ్చా

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

తాడేపల్లి: చంద్రబాబువి దొంగ ఏడుపులు..చిల్లర రాజకీయాలని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదన్నారు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపడమే ఆయన ఉద్దేశమన్నారు. విపత్తును కూడా ప్రభుత్వ వైఫల్యం అంటున్నారని తప్పుపట్టారు. కనీస అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని  మండిపడ్డారు.కేంద్ర మంత్రి ఏదైనా మాట్లాడొచ్చా అని రాష్ట్ర మంత్రి ప్రశ్నించారు. సోమశిలకు గత 140 ఏళ్లలో ఇంత వరద రాలేదన్నారు. అన్నమయ్య కెపాసిటీ 2 లక్షల 17 వేల క్యూసెక్కులు అన్నారు. కానీ గంటల వ్యవధిలోనే 3 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని చెప్పారు. గేట్ల మరమ్మతులపై చంద్రబాబు హయాంలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఇన్ని లక్షల క్యూసెక్కుల ఫ్లడ్‌ వస్తుందని సీడబ్ల్యూసీ ఎక్కడా చెప్పలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అన్నమయ్య రిజర్వాయర్‌కు ఇంకో స్పిల్‌వే కట్టమని డ్యామ్‌ సెప్టీ వాళ్లు రిపోర్టు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ నివేదిక వచ్చిన రెండున్నరేళ్లు టీడీపీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉండిందన్నారు. కనీసం ప్రతిపాదనలు రూపొందించి ఎందుకు టెండర్లు పిలవలేకపోయామని మంత్రి ధ్వజమెత్తారు. ఇప్పుడు జరిగిన విపత్తుకు ముమ్మాటికి చంద్రబాబే కారణమని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రిజర్వాయర్‌ నిండుగా ఉందన్నారు. అన్నమయ్య రిజర్వాయర్‌కు మరో మూడు స్పిల్‌వేలు నిర్మించి ఉంటే ఈ రోజు విపత్తు జరిగేది కాదన్నారు.
 

Back to Top