రూ.1లక్ష కోట్లతో రాయలసీమలో నీటి ప్రాజెక్టులు

ఇరిగేష‌న్ శాఖ‌ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
 

వైఎస్సార్‌ జిల్లా: త్వరలో రూ.1లక్ష కోట్లతో రాయలసీమలో నీటి ప్రాజెక్టులు చేపడుతున్నామని సాగునీటిపారుదల మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. రాయచోటిలో జరిగిన జలయజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ తండ్రిని మించిన తనయుడు అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ తండ్రి ప్రారంభించి పనులు చేయిస్తే.. తనయుడు పూర్తిచేస్తున్నారనిచెప్పారు. గండికోట, గోరకల్లు, అవుకు, చిత్రావతి బ్యాలెన్స్‌ పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహించారని అనిల్‌ విమర్శించారు. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి ఉంటే మరో 50 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రజలకు అందించేవారమన్నారు. గడికోట, చిత్రావతి, పైడిపాళ్యం ప్రాజెక్టులకు రాజశేఖర్‌ రెడ్డి రూ.2500 కోట్లు ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు కనీసం రూ.200 కోట్లు కూడా వెచ్చించలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచి రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నడుంబిగించారని చెప్పారు. 
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేడు..
ఇంకో జన్మ ఎత్తినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేడని మంత్రి అనిల్‌ దుయ్యబట్టారు. ఆయన కరువుకు దత్తపుత్రుడని ఎద్దేవా చేశారు. గత అయిదుసంవత్సరాల్లో 3 సంవత్సరాలు రాష్ట్రంలో కరవు పరిస్థితులునెలకొని ఉండేవని చెప్పారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లు మొత్తం నిండుగా ఉన్నాయని తెలిపారు. 1780 టీఎంసీల వరద వచ్చిందని తెలిపారు. 33 సంవత్సరాల తరువాత ఇంతటి వరద వచ్చిందన్నారు. ఇంకో 5 సంవత్సరాల్లో రాయలసీమ రూపు రేఖలు మారతాĶæన్నారు. 

 

Back to Top