పార్టీ ఆదేశానుసారంగా ప‌ని చేస్తా

నియోజకవర్గం మార్పుపై స్పందించిన మంత్రి ఆదిమూల‌పు సురేష్ 

175 స్థానాల్లో విజ‌యం సాధించ‌డమే మా ల‌క్ష్యం

విజ‌య‌వాడ‌:  పార్టీ ఆదేశానుసారంగా ప‌ని చేస్తాన‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గ మార్పుపై మంత్రి స్పందించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..  నియోజకవర్గ మార్పుపై పార్టీ నిర్ణయమే శిరోధార్యం. పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటాం.. పార్టీలో ఎప్పుడు ఓ సైనికుడిలా పనిచేస్తాం.. మా టార్గెట్ 175 సీట్లు.. జగనన్న మా టీం కెప్టెన్ అనే తేల్చిచెప్పారు. వచ్చే మ్యాచ్ గెలవాలంటే సీఎం వైఎస్‌ జగన్ కూర్పు ఎలా ఉన్నా ఆయన ఫీల్డ్ సెట్టింగ్ ప్రకారం నడుచుకుంటాం అన్నారు. కొండేపిలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తాం తెలిపారు.

పార్టీ స్ట్రాటజీ ప్రకారం కొండేపి నియోజకవర్గంలో గెలవాలన్న ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తాం. గతంలో పనిచేసిన ఇంఛార్జ్‌లను కలుపుకుని.. వారి సహాయ సహకారాలతో తీసుకుంటా.. కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉంది. జగనన్న చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్తాం.. వచ్చే ఎన్నికల్లో కొండేపిలో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు బావుటా ఎగుర వేస్తుంద‌ని ఆదిమూల‌పు సురేష్ ధీమా వ్య‌క్తం చేశారు.

Back to Top