విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల కోసం వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మెడికల్ విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు.. మెడికల్ విద్యార్థులను దారుణంగా కొట్టిన పోలీసులు.. ఆడపిల్లలని కూడా చూడకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. తమను చంపేయండి అంటూ మహిళా విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. విదేశీ వైద్య విద్యార్థులను ఏఆర్ గ్రౌండ్స్‌కి పోలీసులు తరలించారు. గాయాలపాలైన విద్యార్ధులకు వైద్య సదుపాయం కూడా అందించలేదు. విద్యార్థులను కలిసేందుకు ఏఆర్ గ్రౌండ్స్‌కు వచ్చిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ రాగా.. విద్యార్థులను కలవడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఏఆర్ గ్రౌండ్స్‌లోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా పోలీసులు గేట్లు వేసేశారు. విదేశీ వైద్య విద్యార్థులను పరామర్శించేందుకు ఏఆర్ గ్రౌండ్స్‌కి వచ్చిన సీపీఎం నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసులపై సీపీఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇక్కడ వైద్య విద్యను అభ్యసించే అవకాశం కల్పించలేకపోతున్నారని.. అందుకే ఏటా వందల మంది విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల ఆందోళన చేస్తున్నా హెల్త్ మినిస్టర్ కనీసం పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సాక్షిగా విద్యార్థులపై దాడి జరగడం హేయమైన చర్య, దేశమంతా ఒక రూలు.. ఏపీలో మరొక రూలా? ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అంటూ బాబురావు ప్రశ్నించారు. యువ వైద్యులపై పోలీసుల దాష్టీకాన్ని వైయస్ఆర్‌సీపీ నేతలు డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, డాక్టర్ సునీల్ తీవ్రంగా ఖండించారు. న్యాయమైన డిమాండ్‌తో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన యువ వైద్యులు రిజిస్టార్‌ను కలిసేందుకు విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తరలి వస్తే పోలీసులు లాఠీచార్జ్ చేయడం అమానుషమని, యువ వైద్యులకు అండగా ఉంటామని డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. డాక్టర్ సీదిరి అప్పలరాజు వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రతో సహా, పలువురు విద్యార్థుల రాక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వచ్చిన ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్. ఆయన్ను కలిసేందుకు యువ వైద్యుల ప్రయత్నం పట్టించుకోకుండా యూనివర్సిటీలోకి వెళ్లిపోయిన ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు కామెంట్స్ యువ వైద్యులు, విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసుల దాష్టికం మహిళా యువ వైద్యురాళ్లపైనా దాష్టికం. నిర్దయగా లాగి పడేసిన పోలీసులు ఇంత కంటే తమను చంపేయాలంటూ వేడుకున్న మహిళా యువ వైద్యురాళ్లు డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి , డాక్టర్ సునిల్ కామెంట్స్ తాము వైద్యులమన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా పోలీసులు హేయంగా ప్రవర్తిస్తున్నారంటూ యువ మహిళా వైద్యుల కన్నీరుమున్నీరు అందరినీ బలవంతంగా వ్యాన్ ఎక్కించి లాక్కెళ్లిన పోలీసులు పలువురు విద్యార్థుల చొక్కాలు చినిగినా, పట్టించుకోని పోలీసులు యువ వైద్యులు, విద్యార్థులను ఏఆర్ గ్రౌండ్స్‌కు తరలించిన పోలీసులు అదుపులోకి తీసుకున్న యువ వైద్యులందరినీ వెంటనే విడిచిపెట్టాలి