పాలకొండ : కూటమి ప్రభుత్వం నమ్మించి చేసిన మోసాన్ని ఇంటింటా విస్తృతంగా ప్రచారం చేయాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ తనుజారాణి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోని క్యూఆర్ కోడ్ ద్వారా చేరువ చేయాలని ఆయన సూచించారు. పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అధ్యక్షతన, ఎమ్మెల్సీ విక్రాంత్ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను వారికి వివరించి ఎప్పుడు ఎన్నికలు జరిగినా సంసిద్ధంగా ఉండి వైయస్ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకువచ్చి వైయస్ జగన్‌మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్తు రాజు క్యూఆర్ కోడ్ స్కానింగ్, చంద్రబాబు హామీలు, వైయస్ జగన్ సందేశం గురించి వివరిస్తూ రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టోపై దిశానిర్దేశం చేశారు.