కూట‌మి పాల‌న‌లో అభివృద్ధి, సంక్షేమం శూన్యం

 క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి

మంత్రాల‌యంలో బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ కార్య‌క్ర‌మం

క‌ర్నూలు:  కూట‌మి ప్ర‌భుత్వం ఏడాది పాల‌న‌లో అభివృద్ధి, సంక్షేమం శూన్య‌మ‌ని క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. మంత్రాల‌యంలో ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి అధ్య‌క్ష‌త‌న బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..కూటమి పాలనలో అంతా చీకటిమ‌య‌మ‌న్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేదల జీవితాల్లో చీకట్లు నింపిందని తెలిపారు. మండల స్థాయిలో నాయకులు గ్రామాల్లో పర్యటించి సీఎం చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. రెడ్ బుక్ కు భయపడేది లేదు అని రెడ్ బుక్ లను ఎన్నో చూసి రాజకీయాల్లో కొనసాగుతున్నామని చెప్పారు.  ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజ‌మ‌న్నారు. కూట‌మి వైఫ‌ల్యాల‌ను ఇంటింటా ఎండ‌గ‌డుదామ‌ని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శశికళ , యువ‌నాయ‌కులు ప్ర‌దీప్‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Back to Top