వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తపై 'టీడీపీ' దాష్టీకం

కర్రలు, రాళ్లతో విచక్షణరహితంగా దాడి

వైయ‌స్ఆర్ జిల్లా :  పార్నపల్లికి చెందిన టీడీపీ నాయకులు వైయ‌స్ఆర్‌సీపీ కార్య కర్త అశోక్కుమార్పై విచక్షణారహితంగా దాడి చేశారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం దాడితోట గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ (అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ) వద్ద మంగళవారం సాయంత్రం ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరా లు.. పార్నపల్లికి చెందిన అశోక్ కుమార్ అదాని కం పెనీలో కేబుల్ పనులు చేస్తున్నాడు. ఆ పనులను తమకు అప్పగించాలని పార్నపల్లికి చెందిన టీడీపీ నాయకులు పుల్లానాయుడు, ధనుంజయ తదిత రులు కొన్ని రోజులుగా అశోకకుమార్పై ఒత్తిడి తెస్తున్నారు. అందుకు ఆయన సమ్మతించకపోవడం తో పవర్ ప్రాజెక్ట్ సమీపంలోని సంతోష్‌కుమార్‌రెడ్డి ధాబా వద్ద ఉన్న అశోక్ కుమార్పై పుల్లానాయుడు, ధనుంజయ అనుచరులు 15 మంది కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ధాబా యజమాని వారిని అడ్డుకుని బాధితుడిని తన ధాబాలోకి తీసుకెళ్లాడు. అయినా కూడా వదలకుం డా టీడీపీ నాయకులు ధాబా యజమానితోనూ గొడవకు దిగారు. అశోక్కుమార్ను తమకు అప్ప గించాలని, లేదంటే అంతు చూస్తామంటూ బెదిరిం చారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ధాబా యజమాని సంతోష్కుమార్రెడ్డి వెంటనే తాడిమర్రి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడిని ధర్మవరం ప్రభు త్వాస్పత్రికి తరలించారు. బాధితుడు మాట్లాడుతూ. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులన్నీ వారి కనుసన్నల్లోనే జరగాలన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లను భయభ్రాంతు లకు గురి చేసేందుకే తనపై దాడి చేసినట్టు తెలి పారు. తాడిమర్రి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Back to Top