వైయస్ఆర్ జిల్లా: తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చేపడుతున్న తొలి అడుగు కార్యక్రమం చంద్రబాబుకు చివరి అడుగు కాబోతుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏడాది పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నిలదీస్తారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అస్వస్థతకు నుండి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..`కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోలో అమలుపై ప్రజలకు వివరిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా తొలి అడుగు కార్యక్రమంపై ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు, ఎన్నికల్లో 363 హామీలు ఇచ్చారు. నాలుగు మాత్రమే అమలు చేశారు. కూటమి ప్రభుత్వం పింఛన్లు అందరికి అందించలేదు, తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 83 లక్షలు మంది పిల్లలు ఉంటే 50 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు కాక రూ. 20 వేలు ఇవ్వాలి. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన వారికి రూ.18 వేలు ఇస్తామన్నారు..ఏమైంది?. నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు ఆపథకం ఏమైంది. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇంతవరకు ఇవ్వలేదు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామన్నారు ఏమైంది?, అర్హత కలిగిన జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? పొదుపు సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. రుణం 3 లక్షల నుంచి 10 లక్షల కు పెంచుతామన్నారు. ఇంతవరకు చేయలేదు. 50 సంవత్సరాల వయసు నిండిన అందరికి పింఛన్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు జాన్ 2024 నుంచి అమలు చేస్తామని ప్రజలకు బాండ్లు ఇచ్చారు. ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి వీటిపై కోర్టులో కేసు వేస్తాం` అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.