తాడేపల్లి: అల్లూరి సీతారామరాజు పేరు కలకాలం గుర్తించుకునేలా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాగా నామకరణం చేశామని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా మన్యం వీరుడికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. `బ్రిటిష్ పాలనను ఎదురించి, స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గారు. గిరిజనుల హక్కులకోసం, వారి ఆత్మగౌరవం కోసం, వారితో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర్య పోరాటం చిరస్మరణీయమైనది. ఆ గొప్ప యోధుడిని కలకాలం గుర్తుంచుకునేలా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాను ఏర్పాటు చేసి, ఆయనను గౌరవించుకున్నాం. నేడు ఆ మహావీరుడి జయంతి సందర్భంగా నివాళులు’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు. పింగళి వెంకయ్యకు మనస్ఫూర్తిగా నివాళులు `గుండెల నిండా దేశభక్తిని నింపుకుని, మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించిన మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య గారు. నేడు ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు` అంటూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం పోస్టు చేశారు. యువతకు స్ఫూర్తి..స్వామి వివేకానంద 'మందలో ఒకరిగా ఉండకు.. వందలో ఒకరిగా ఉండు' అంటూ సూక్తులు, స్ఫూర్తి దాయక ప్రసంగాలతో యువతను చైతన్య పరిచిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారు. నేడు ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా నివాళులు` అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు. పోరాట యోధుడు వంగవీటి మోహన రంగా `పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు` అంటూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. రోశయ్య సేవలు చిరస్మరణీయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఇవాళ రోశయ్య జయంతి సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పిస్తూ తన ఎక్స్ ఖాతాలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డితో రోశయ్య ఉన్న ఫొటోను పోస్టు చేశారు.