పదేపదే దళిత సమాజాన్ని అవమానిస్తున్న చంద్రబాబు

చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు

మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు వెల్లడి

చంద్రబాబుకు దళితులంటే ఆది నుంచి చిన్నచూపు

మృతి చెందిన సింగయ్యకు కనీస గౌరవం లేదా?

దళితుడు కాబట్టే 'కుక్క'తో పోలుస్తూ హీనంగా మాట్లాడారు

తన ప్రచారం కోసం అనేక మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నాడు

ఆయన మాటలను బట్టి దీనికి కారకుడైన చంద్రబాబును ప్రజలు కుక్కను కొట్టినట్లు కొట్టకూడదా?

మీరు మాట్లాడినట్లుగా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మేం ఏనాడు చేయం

మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు

తాడేపల్లి: దళిత సమాజాన్ని కించపరుస్తూ అహంకారంతో పదేపదే మాట్లాడటం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల మృతి చెందిన దళితుడు సింగయ్యకు కనీసం ఒక మనిషికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా 'కుక్క'తో పోలుస్తూ హీనంగా మాట్లాడిన చంద్రబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నామని వెల్లడించారు. వైయస్ జగన్‌ను ఉద్దేశించి నోరు పారేసుకున్న చంద్రబాబు మాటలను బట్టి గతంలో ఆయన వల్ల జరిగిన మరణాలకు గానూ ప్రజలు తనను కుక్కను కొట్టినట్లు కొట్టి ఉండేవారు కాదా అని అన్నారు. చంద్రబాబు ఉపయోగించే సంస్కారహీనమైన ఇటువంటి భాషను వైయస్ఆర్‌సీపీ శ్రేణులు మాట్లాడటానికి ఏ మాత్రం ఇష్టపడవని అన్నారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

అమరావతిలో రియల్ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసుకోవడం, కాంట్రాక్టర్‌ల నుంచి ముడుపులు స్వీకరించడమే పాలనగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల గురించి, రైతుల గురించి ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించలేదు. పైగా ప్రజాసమస్యలపై స్పందిస్తున్న ప్రతిపక్షనేతపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. పల్నాడులో వైయస్ జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలో సింగయ్య అనే దళితుడు మరణిస్తే, ఆయన మృతిపైన కూడా చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం అత్యంత దారుణం. ఆ బాధిత దళిత కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం లేదా? పైగా మరణించిన ఒక దళితుడిని ఉద్దేశించి ఒక మనిషికి కూడా ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా 'వాడు', 'కుక్కను లాగేసినట్లు'అంటూ నీచంగా పోలుస్తూ చంద్రబాబు మాట్లాడటం ద్వారా మొత్తం దళిత సమాజానే అవమానించారు. ఇంకా దళితులు ఎన్ని అవమానాలను భరించాలి? తెనాలిలో దళిత యువకులను నడిరోడ్డుపై హింసించడమే కాకుండా, వారిని గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు అంటూ సమాజంలో వ్యతిరేకతను పెంచేలా చంద్రబాబు మాట్లాడారు. ఇప్పుడు చీలి సింగయ్యను కుక్కతో పోలుస్తూ హీనంగా మాట్లాడారు. ఇదేనా చంద్రబాబుకు తోటి మనుషులు, ముఖ్యంగా దళితుల పట్ల ఉన్న భావం? గతంలో కూడా దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం గతంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి దళితులు మురికిగా ఉంటారు, మీకెందుకురా చదువులు అంటూ హేళనగా మాట్లాడారు. విప్‌గా పని చేసిన చింతమనేని ప్రభాకర్ దళితులను మీకెందుకురా రాజకీయాలు అంటూ అవమానించారు. ఇంకా ఈ అవమానాలను దళిత సమాజం భరించేందుకు సిద్దంగా లేదు. చంద్రబాబుకు ఇదే చివరి హెచ్చరిక. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైయస్ఆర్‌సీపీ దళిత విభాగం ఆధ్వర్యంలో దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నాం.

సింగయ్యది ప్రభుత్వం చేసిన హత్య

సింగయ్య మరణం ప్రభుత్వం చేసిన హత్య. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఈ మృతిని వైయస్ జగన్‌కు ఆపాదించే ప్రయత్నం చేస్తోంది. గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది మృతికి కారకుడైన చంద్రబాబుకు ఆనాడు బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ లేకుండా ఉంటే ప్రజలే తగిన విధంగా బుద్దిచెప్పి ఉండేవారు. కందుకూరులో ఇరుకు సందుల్లో మీటింగ్‌ పెట్టి ఎనిమిది మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇలా తన హయాంలో జరిగిన వాటిని ప్రమాదాలుగా సమర్థించుకునే చంద్రబాబు, సత్తెనపల్లిలో చీలి సింగయ్య మృతిని మాత్రం ఉద్దేశపూర్వకంగా చేశారంటూ వైయస్ జగన్‌కు ఆపాదించే దిక్కుమాలిన రాజకీయానికి సిగ్గులేకుండా పాల్పడుతున్నాడు. పైగా ఈఘటనలో చనిపోయిన దళితుడు సింగయ్యను కనీస గౌరవం లేకుండా అవమానకరంగా మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడిన మాటలను కూడా రాష్ట్ర ప్రజలు చూడాలని ఆ వీడియోలను కూడా ప్రదర్శిస్తున్నాం. 78 ఏళ్ళ వయస్సు ఉన్న సీఎం చంద్రబాబు ఎలాంటి నీచమైన మాటలు మాట్లాడారో ప్రజలు కూడా గమనించాలి. ప్రతిపక్షనేత వైయస జగన్‌ను కుక్కను కొట్టినట్లు కొట్టాలని మాట్లాడటానికి నోరు ఎలా వచ్చింది? రాష్ట్రంలో ఆయన వల్ల జరిగిన మరణాలపై చనిపోయిన కుటుంబాలు దీనికి బాధ్యత వహించమంటూ సీఎం చంద్రబాబును ఆగ్రహంతో కొట్టాల్సి వస్తే ఆయనను కుక్కను కొట్టినట్లుగానా, పందిని కొట్టినట్లుగానా? ఎలా కొట్టాలి? మేం కూడా ఇలాగే సంస్కారం లేకుండా మాట్లాడగలం. కానీ మా పార్టీ విధానం ఇటువంటి వాటికి వ్యతిరేకం. మా పార్టీ మొదలైందే మానవత్వం, ఓదార్పు, కష్టాల్లో ఉండే వారిని ఆదుకోవడం, అండగా ఉండటంతో. అటువంటి గుణాలు చంద్రబాబులో మచ్చుకు కూడా కనిపించవు. రోడ్డుపై ప్రయాణిస్తుంటే ఎవరైనా మార్గమధ్యలో గాయపడినట్లు, అస్వస్థతకు గురైనట్లు కనిపిస్తే, తక్షణం వైయస్ జగన్ స్పందిస్తారు. కారు దిగి వారిని పరామర్శించి, సాయం కోసం తన పక్కన ఉన్న వారిని నియమించిన తరువాతే ఆయన కదులుతారు. ఇదీ వైయస్ జగన్ నైజం. కానీ చంద్రబాబు, లోకేష్‌లు మాత్రం రోడ్డు ప్రమాదంలో ఒక దళితుడు మృతి చెందితే, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి, వారి ఇంటికి మనుషులును పంపి, తాము చెప్పినట్లుగా తప్పుడు కేసులు పెట్టాలంటూ బెదిరించారంటే వారిలోని రాక్షసత్వం అర్థమవుతుంది. తన భర్త మృతిపై సింగయ్య భార్య మీడియా ముందు వ్యక్తం చేసిన అనుమానాలపై విచారణ జరిపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ ను కూడా తన క్షుద్రరాజకీయాలకు వారసుడుగా మార్చాడు.  పొన్నూరులో వైయస్ఆర్‌సీపీ సర్పంచ్‌ను నడిరోడ్డుపై తలపగులగొడుతూ, చంపేందుకు ప్రయత్నిస్తుంటే శాంతిభద్రతలు ఏమయ్యాయి? రెడ్‌బుక్ పేరుతో హత్యారాజకీయాలు, దౌర్జన్యాలు, దాడులకు తెగబడాలని ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పుతున్న మీకు పాలించే అర్హత ఉందా?

Back to Top