పొన్నూరులో వైయ‌స్ఆర్‌సీపీ సర్పంచ్‌పై ప‌చ్చ‌గూండాల‌ దాడి

 పరిస్థితి విషమం

గుంటూరు జిల్లా: పొన్నూరు మండలం మన్నవ గ్రామ పంచాయతీ సర్పంచ్ బోనిగల నాగమల్లేశ్వరరావు పై తెలుగు దేశం పార్టీ గూండాలు విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. గురువారం పొన్నూరు శివారు కట్టెంపూడి నాగేంద్ర స్వామి పుట్టవద్ద టిడిపి గుండాలు దాడి చేసి హత్యాయత్నం చేశారు. స్థానికులు హుటాహుటిన పొన్నూరు ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు వైద్యశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Back to Top