రెండేళ్లలో స్కూళ్ల ముఖచిత్రాలను మారుస్తాం..

మూతబడిన బడులను తిరిగి తెరిపిస్తాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు  సురేష్‌ 

అమరావతిః రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాలను మార్చి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కనీవినీ ఎరుగని రీతిలో  సూళ్లలో కనీస సౌకర్యాలకు 2019–20 బడ్జెట్‌లో  1500 కోట్ల రూపాయలు కేటాయించామని వెల్లడించారు. విద్యాభివృద్ధికి ఈ దేశానికే ఆదర్శంగా బడ్జెట్‌ కేటాయించడం జరిగిందన్నారు. 25వేల  పాఠశాలలకు కాంపౌండ్‌ వాల్స్‌ లేని పరిస్థితి ఉందన్నారు.రా బోయే రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాన్ని  మారుస్తామన్నారు.

విద్యకు ఏవిధంగా పెద్దపీట వేస్తామో చేసి చూపిస్తామన్నారు. రేషనలైజేషన్‌ పేరుతో మూతబడిన బడులను తిరిగి తెరిపిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల కోసం బడ్జెట్‌లో రూ.160 కోట్లు కేటాయించామన్నారు.బయో టాయిలెట్లు ఏర్పాటుపై కూడా ఆలోచిస్తామన్నారు. స్కూ మేనేజ్‌మెంట్‌ కమిటీలను టీడీపీ సర్కార్‌ పూర్తిగా రాజకీయం చేసిందన్నారు. పారిశుధ్య కార్మికులకు జీతాలిచ్చే మనసు చంద్రబాబు సర్కార్‌కు లేకపోయింది.గత టీడీపీ ప్రభుత్వానికి టెండర్ల ఉన్న శ్రద్ధ..  పారిశుధ్య కార్మికులపై ఉంటే వారి  సమస్య పరిష్కరం అయ్యేందన్నారు.

 

Back to Top