చట్టానికి దొరికిన దొంగ చంద్రబాబు 

లోకేశ్‌ రెడీగా ఉండు.. త్వరలో జైలుకే

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పారదర్శకంగా సంక్షేమం అందిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక పోయారు

ప‌వ‌న్‌ ఎందుకు వచ్చాడో, రోడ్డుమీద ఎందుకు పడుకున్నాడో ఆయనకే తెలియదు

రాష్ట్రంలో టీడీపీ బంద్‌కు ఎలాంటి స్పందన లేదు

తాడేపల్లి: చట్టానికి దొరికిన దొంగ చంద్రబాబు అంటూ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. చంద్రబాబు.. ప్రజల సొమ్ము దోచుకుని చివరికి జైలు పాలయ్యాడు. ఎప్పుడో ఒకప్పుడు చేసిన పాపం పండకపోదు. మంత్రి మేరుగు నాగార్జున మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం. చట్టాలు చంద్రబాబుకు చుట్టాలు కావు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు ఇంకా అనేక కేసుల్లో ఇరుక్కుంటారు. ప్రజల్లో చంద్రబాబుకు సానుభూతి లేదు. త్వరలో నారా లోకేశ్‌ కూడా ముద్దాయి కాబోతున్నాడు. ఇకనైనా చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.  

అభినవ వీరప్పన్ చంద్రబాబుః
- చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు చట్టానికి చిక్కాడు. చంద్రబాబు అరెస్టు ద్వారా..  న్యాయం గెలిచింది. చట్టాలు చంద్రబాబుకు చుట్టాలు కావని మొట్టమొదటిసారి నిరూపితం అయింది. చంద్రబాబు అవినీతి కేసులో.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.రాబోయే రోజుల్లో చంద్రబాబు ఇంకా అనేక అవినీతి కేసుల్లో విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ప్రజల్లో చంద్రబాబుకు సానుభూతి లేదు.
 
- చంద్రబాబు జైలుకు వెళ్లినా, ఆయన కానీ, ఆయన అనుచరులు, ఆయన కొడుకు లోకేశ్ ఏమాత్రం సిగ్గుపడటం లేదు. 45 ఏళ్లుగా కోర్టులను అడ్డంపెట్టుకుని చంద్రబాబు అనేక నేరాలు,ఘోరాలు, అవినీతి, కుంభకోణాలు చేసినా  చట్టానికి దొరక్కుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. నేడు అభినవ వీరప్పన్‌లాగా చంద్రబాబు కోర్టుకు దొరికిపోయి జైలుకు వెళ్లాడు.

బాబు తప్పు చేశారు కానీ..ఎలా అరెస్టు చేస్తారు అంటున్నారుః 
- చంద్రబాబు కానీ, ఆయన తెచ్చుకున్న లాయర్లుగానీ, వారి టీమ్‌ గానీ, ఎల్లో మీడియా, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా అంతా స్కిల్‌ స్కాంలో చంద్రబాబు తప్పు చేయలేదని అనటం లేదు.కేసులో టెక్నికల్ ప్రాబ్లమ్‌ ఉంది. గవర్నర్‌కు చెప్పలేదు. 24 గంటలలోపు కోర్టులో హాజరుపరచలేదు అని మాత్రమే అంటున్నారు. కానీ చంద్రబాబు అవినీతి చేయలేదని ఎవరూ చెప్పటం లేదు. చంద్రబాబు అవినీతి చేశాడని టీడీపీ నాయకులకు కూడా తెలుసు. చంద్రబాబు తప్పు చేయకపోతే.. 
అతను నిప్పే అయితే...  తన  మీద సీబీఐ, ఈడీ ఎంక్వైరీ వేసుకోండని చెప్పే పరిస్థితిలో చంద్రబాబు లేడు. అధికార దాహంతో వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ చంద్రబాబు చట్ట విరుద్ధ పనులన్నీ చేశాడు. 

బాబు స్కాములపై ఒక్క ముక్క రాయరుః
-  చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అవినీతికి పాల్పడినట్టు అడ్డంగా దొరికినా..  ఆయనను ఆకాశానికి ఎత్తుతూ ఎల్లో మీడియాలో పుంఖానుపుంఖాలుగా రాతలు రాస్తున్నారు. చంద్రబాబు చేసిన అవినీతి, అరాచం గురించి ఎల్లో మీడియాలో చిన్న ముక్క కూడా రాయరు. చివరకి ఎంతగా దిగజారిపోయారంటే.. అవినీతిని కూడా మంచిగా చూపిస్తున్నారు.

- చంద్రబాబు అవినీతి ఊబిలో కూరుకుపోయి దొంగలా జైలుకు పోతే మరిదిని వెనకేసుకు వస్తూ పురంధేశ్వరి మాట్లాడుతోంది. ఇంతకాలం అందర్నీ మేనేజ్‌ చేసుకున్న గజదొంగగా చంద్రబాబు మిగిలిపోయారు. ఏ వ్యవస్థనైనా చంద్రబాబు మేనేజ్ చేస్తాడనే భావన ప్రజల్లో తెచ్చాడు. 

బాబు జీవితమంతా స్కాములే..
- ఏలేరు స్కాం నుంచి హైటెక్ సిటీ, ఐఎంజీ భారత్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, బీసీలకు పనిముట్లు కొనుగోలు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయటం, ఓటుకు కోట్లు కేసు కూడా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఏ అవినీతి చేసినా చంద్రబాబు మేనేజ్ చేస్తారని అనుచరులు అనుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు చంద్రబాబు జైల్లోకి వెళ్లిపోయిన తర్వాత అందరూ జారుకుంటున్నారు. ఇదే కేసులో రేపు లోకేశ్ కూడా జైలుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. 

టీడీపీ బంద్ ఎల్లో మీడియాలోనే విజయవంతంః
- ఎవరి కోసం ఆంధ్ర రాష్ట్ర బంద్ చేశారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా బంద్ చేస్తారా? మీరు బంద్ అంటే.. ఒక్కరైనా షాపు మూశారా? ఒక బస్సు ఆగిందా? ఒక విద్యా సంస్థ ఆగిందా? ప్రజల్లో చంద్రబాబు మీద అంత ద్వేషం ఉంది. ఇవాళ ప్రజల్లో  చంద్రబాబు బలం ఏమిటో తెలిసింది. 

బూతులు మాట్లాడితే ఖబడ్ధార్ః
చంద్రబాబు దొంగ అని నిగ్గుతేల్చేశారు. అందుకే చంద్రబాబు కొడుకు లోకేశ్ అడ్డం వచ్చినట్లు మాట్లాడాడు. మేము కూడా మీలాగ మాట్లాడితే తట్టుకోలేరు. విశాఖలో అయ్యన్న, బండారు సత్యనారాయణ మూర్తి ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లారు. నాయకత్వం లేదు. పోరాటం చేసేవారు లేడు. అబద్ధాలు చెప్పేవారు అస్సలు ఉండరు. టీడీపీ అంతా డొల్లలా అయిపోయిన పరిస్థితి. దాంతో ఫ్రస్ట్రేషన్ తో నోటికి వచ్చిన భాష మాట్లాడితే ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు.

- చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో పార్టీని నడుపుతున్నారు. చంద్రబాబుకు అడ్డగోలుగా దుష్టచతుష్టం మద్దతు పలుకుతుంది. వీరందరూ కలిసి జగన్ గారిపై గుడ్డ కాల్చి నెత్తిన వేయాలని చూశారు. ఇప్పుడు న్యాయస్థానం బాబును దొంగగా తేల్చింది. చంద్రబాబు మీద అనేక కేసులు ఉన్నాయి. ప్రతి కేసులో  చంద్రబాబు ముద్దాయి కాబోతున్నారు. లోకేశ్ కూడా ముద్దాయి కాబోతున్నారు. పేదల సొమ్ము, నిరుద్యోగుల సొమ్ము తిమింగలాలుగా మింగితే.. చట్టాలు ఊరుకుంటాయా? 

జగన్ గారిపై పూర్తి  విశ్వాసంః
- ఏపీలో పరిపాలన చూస్తే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు  పూర్తి విశ్వాసం కల్పిస్తున్నారు. సామాజిక విప్లవానికి జగన్ పెద్ద పీట వేశారు. పేదల పక్షపాతిగా సీఎం జగన్ గారు వ్యవహరిస్తున్నారు. లక్షల కోట్లు డీబీటీ రూపంలో ప్రజలకు నేరుగా సీఎం జగన్ గారు అందించారు. భావితరాల భవిష్యత్‌ కోసం నిరంతర శ్రామికుడిలా సీఎం జగన్ గారు పనిచేస్తున్నారు. 

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ
- ఏ రాజకీయ నాయకుడు అయినా అవినీతి చేసి జైలుకు వెళితే.. ప్రభుత్వానికి ఏం సంబంధం. చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. కక్ష ఉంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకోవచ్చు కదా. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. రెండెకరాలున్న చంద్రబాబు కోటాను కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు. 
- ప్రజల సొమ్మును పందికొక్కులా తిన్నవారిలో చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నాడు. దానికి ప్రాయశ్చిత్తం చెల్లించుకోక తప్పదు.
- చంద్రబాబు సరుకు ఏంటో తనకే బాగా తెలుసు. చంద్రబాబు అవినీతిపరుడో, కాదో దేశ నాయకులకు కూడా తెలుసు. 
- వీళ్ళంతా బాబును పక్కన పెట్టి,  రేపు పవన్ కల్యాణ్‌ మా నాయకుడు అని కూడా వెళ్లిపోతారు. ఆ పార్టీ మునిగిపోతున్న నావ. చంద్రాబు అరెస్టు కాగానే.. పవన్ కల్యాణ్‌ ఎందుకు వచ్చాడో తెలియదు. ఎందుకు రోడ్డు మీద పడుకున్నాడో ఆయనకే తెలియదు. 

Back to Top