అది మా పార్టీలో ఉన్న నైతికత 

మంత్రి మేరుగ నాగార్జున‌

 శ్రీకాకుళం: ద‌ళితుడైన సుబ్రహ్మణ్యం  మృతి విషయంలో ఎమ్మెల్సీపై అనుమానం వ్యక్తం చేస్తే కేసు నమోదు చేసాం. అది మా పార్టీలో ఉన్న నైతికత అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం మరణం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఈ క్రమంలో మంత్రి మేరుగ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఘటన జరిగిన వెంటనే , ప్రక్కదారి పట్టకుండా, చట్టం క్రింద అంతా సమానులే అంటూ భాద్యులు ఎవరైనా శిక్షపడాల్సిందేనన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దన్యవాదాలు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని. వారికి మనోదైర్యం కల్పించాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశించారు.

చంద్రబాబు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. దళిత సంక్షేమాన్ని కోరే నాయకుడు సీఎం జగన్‌. దళితులకు సీఎం జగన్ ఒక పెట్టని కోట. సుబ్రహ్మణ్యానిది కచ్చితంగా హాత్యే, ఆయన మృతిపై మేము చాలా భాదపడుతున్నాం. వందకు 100శాతం సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా ఉంటాం. చిత్తశుద్దితో కేసుని విచారణ చేస్తున్నాం. దళితులు మీద దాడిచేస్తే ఎలాంటి వాడైనా శిక్షించి తీరుతాం.

అనంత బాబుని కేసులో ముద్దాయిగా చేశాం. తప్పు చేస్తే కచ్చితంగా శిక్షపడుతుంది. ఎవరైనా చనిపోతే గ్రద్దల్లా అక్కడకు వెళ్లి నిలబడేతత్వం ప్రదర్శిస్తున్నారు. శవాలు తీసుకెళ్తే లోకేష్ వస్తారని చెబుతున్నారు. దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయవద్దు. చంద్రబాబు ఆరోపణలను చూస్తూ ఊరుకోవడానికి సిద్దంగా లేం. 120 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాం పెట్టిన చరిత్ర, అంబేడ్కర్‌ పేరు జిల్లాకు పెట్టిన చరిత్ర, దళితులతో వియ్యం అందిన కుటుంబం మా ముఖ్యమంత్రి జగన్‌ది. దళిత కులంలో ఎవరూ పుట్టకూడదని చెప్పిన నీచుడు చంద్రబాబు. టీడీపీ నేతలు దళితులను అడ్డం పెట్టుకుని కపట నాటకాలు ఆడాలని చూస్తున్నారు. దళితులపై దాడులు చేస్తే ఊరుకోము’’ అంటూ హెచ్చరించారు.

Back to Top