తాడేపల్లి: పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి ప్రమాదకరమని వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. `ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టడం అత్యంత దారుణం, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి. సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు. సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాడులతో పాటు పత్రిక ప్రతులను దహనం చేయడం వంటి చర్యలు దిగ్భ్రాంతి కలిగించాయి. పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి ప్రమాదకరం. విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించినప్పటికీ అరెస్ట్ చేయడం, 70 ఏళ్ల కొమ్మినేనిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం అత్యంత దారుణం.దేశవ్యాప్తంగా ఇలాంటి టాక్ షోలు చేసే వారు అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు.. కొమ్మినేనిపై పెట్టినట్టు వారందరిపైనా అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపుతారా` అని మేరుగు నాగార్జున ప్రశ్నించారు.