మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డికి బీఫారం అంద‌జేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్

తాడేపల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయనున్న మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా బీఫారం అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top