బాబు హయాంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ 

ప్రైవేట్‌ కంపెనీల కోసం పాలసీలు రూపొందించారు

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

అమరావతి: చంద్రబాబు హయాంలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విమర్శించారు. కొన్ని కంపెనీలకు ప్రభుత్వమే భూమిచ్చి తిరిగి అద్దెకు తీసుకుందన్నారు. గత పాలనలో ప్రభుత్వ సహకారం లేక పరిశ్రమలు వెళ్లిపోయాయని విమర్శించారు. తెలంగాణలో 5 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించారు. 
డీటీపీ పాలసీలో మనమే భూములు ఇచ్చామని, వాళ్ల నుంచి రెంట్‌ తీసుకున్నామన్నారు. ఐటీ బెనిఫిట్స్‌ కూడా కంపెనీలకు ఇచ్చారన్నారు. డీటీపీ పాలసీలో ఇన్‌సైడర్‌ ట్రెడింగ్‌ జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వంలో వారికి తెలిసిన వారికి ఒక పాలసీ, తెలియని వారికి మరో పాలసీ అమలు చేయడంతో పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లారని తెలిపారు. 
 

తాజా ఫోటోలు

Back to Top