27న మ‌హిళా క‌మిష‌న్ ఎదుట హాజ‌ర‌వ్వాల్సిందే..

అత్యాచార ఘ‌ట‌న‌పై టీడీపీ చిల్ల‌ర రాజ‌కీయం

కాల‌కేయుల ముఠా నాయ‌కుడు చంద్ర‌బాబు

మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌

విజ‌య‌వాడ‌: మ‌హిళా క‌మిష‌న్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఇచ్చిన స‌మ‌న్ల‌పై టీడీపీ నేత బోండా ఉమా నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌టంపై క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బోండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని అన్నారు. బోండా ఉమా లాంటి కాలకేయులకు చంద్రబాబు నాయకుడని ధ్వ‌జ‌మెత్తారు. విజ‌య‌వాడ‌లో మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ మీడియాతో మాట్లాడారు. అత్యాచార ఘటనపై టీడీపీ చిల్లర రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కమిషన్‌కు వివరణ ఇచ్చే ధైర్యం చం ద్రబాబు, బోండా ఉమకు లేదని దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. 

ఈ నెల 27న చంద్రబాబు, ఉమ వచ్చి కమిషన్‌కు వివరణ ఇవ్వాల్సిందేనని.. లేకుంటే తమ పద్ధతులు తమకుంటాయని హెచ్చరించారు. చైర్‌పర్సన్‌గా తన పదవి పోయే వరకు పోరాడతానని చెబుతున్న చిల్లర రౌడీ బోండా ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపాడా అని ప్రశ్నించారు. మహిళల పట్ల ఇష్టానుసారం మాట్లాడితే బోండా ఉమ చెప్పు దెబ్బలు తినడం ఖాయమని హెచ్చ‌రించారు. 

తాజా వీడియోలు

Back to Top