దాడులతో  ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు

వైయ‌స్ఆర్‌సీపీలో నిఖార్సైన‌ కార్యకర్తలు ఉన్నారు

కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటా మదనపల్లె వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ భరోసా

అన్న‌మ‌య్య జిల్లా:  దాడులతో కార్య‌క‌ర్త‌ల ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తీయ‌లేర‌ని మదనపల్లె వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ హెచ్చ‌రించారు. మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీ దిగువ దొనబైలులో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను నిస్సార్ అహమ్మద్ శుక్ర‌వారం ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...`కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తరుచు దాడులతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి ఆత్మస్థైర్యం దెబ్బ తీయాలని చూస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీకి కార్య‌క‌ర్త‌ల‌ను దూరం చేయాల‌నే కూట‌మి నేత‌ల పన్నాగాలు నెర‌వేర‌వు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌రు. ఇక్క‌డ నిఖార్సైన కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. టీడీపీ నేత‌ల దాడిలో గాయపడిన వారికి అండగా వుంటాం` అని భరోసా క‌ల్పించారు. ఆయ‌న వెంట వైయ‌స్ఆర్‌సీపీ మండ‌ల కన్వీనర్ కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ గణేష్, లక్ష్మీదేవి, హరి, చలపతి, చంద్ర, నాగరాజ, వెంకట్రమణ, భాస్కర, రెడ్డి, మహేశ్, యూనస్, సాదిక్, అబ్దుల్లా, మల్లికార్జున ఉన్నారు.

Back to Top