చిన్నారి లిషిత‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

తాడేప‌ల్లి: ఫైర్‌ లింబో స్కేటింగ్‌ వజ్ర వరల్డ్‌ రికార్డ్‌ కైవసం చేసుకున్న చిన్నారి లిషిత‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప‌ట్ట‌ణానికి చెందిన చిన్నారి జొన్నాదుల లిషిత ( 5 సంవత్సరాలు ) ఇటీవల తణుకులో ప్రపంచ రికార్డ్‌ కోసం ఏర్పాటు చేసిన‌ ప్రత్యేక ప్రదర్శనలో 20 మీటర్ల పొడవు, 8 అంగుళాల ఎత్తు కేటగిరిలో ఫైర్‌ లింబో స్కేటింగ్‌ వజ్ర వరల్డ్‌ రికార్డ్ సొంతం చేసుకుంది. గురువారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, లిషిత తల్లిదండ్రులు అనూష, ఉమా మహేశ్వర్, కోచ్‌ లావణ్య.క‌లిశారు. ఈ సంద‌ర్భంగా లిషిత‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అభినందించి, లక్ష రూపాయల నగదు పారితోషికం ప్రకటించారు.

Back to Top