సాంకేతికతతో సైన్యంగా కదులుదాం.. 

కార్యకర్తే వైయ‌స్ఆర్‌సీపీకి అసలైన బలం:  డాక్టర్ బొత్స అనూష

చీపురుపల్లి నియోజకవర్గంలో  ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ 

చీపురుపల్లి : వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను సాంకేతికంగా మరింత బలోపేతం చేసి, ప్రతి కార్యకర్తను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానించే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన  ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ను చీపురుపల్లి నియోజకవర్గంలో ఘనంగా ఆవిష్కరించారు. గరివిడి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష పాల్గొని యాప్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష మాట్లాడుతూ, "జగన్ 2.0 సూపర్ యాప్ మన నాయకుడు వైయస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన శక్తివంతమైన అస్త్రం` అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలే వైయ‌స్ఆర్‌సీపీకి అసలైన బలమని, వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి పార్టీతో నిరంతరం అనుసంధానంగా ఉంచేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌లా పనిచేస్తూ ఈ యాప్‌ను ప్రతి ఇంటికీ చేరవేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తల సంక్షేమం, భద్రత, సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ఈ యాప్‌ను రూపొందించారని పేర్కొంటూ, రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ పోరాటంలో ఈ డిజిటల్ వేదిక వైయ‌స్ఆర్‌సీపీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, పార్టీ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడంలో చీపురుపల్లి నియోజకవర్గం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ను ప్రతి కార్యకర్త వినియోగించుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, యువజన నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.  

Back to Top