గోరుకల్లు నీటి కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట..  

రైతులకు వెంటనే నీరు విడుదల చేయాలని కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్‌

నంద్యాల జిల్లా: గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ఎస్‌ఆర్‌బీసీ కాల్వకు నీటిని విడుదల చేయాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పోరుబాట చేప‌ట్టారు. గోరుకల్లు రిజర్వాయర్‌ వద్దకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతుల సాగు అవసరాల కోసం గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ఎస్‌ఆర్‌బీసీ కాల్వకు వెంటనే నీటిని విడుదల చేయాలని కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన నీటిని విడుదల చేసి వారి పంటలను కాపాడాలని, సాగునీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.
 

Back to Top