రాష్ట్రాభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోంది

టీడీపీ దురాలోచనలను ప్రజలు గ్రహించాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

అమరావతిః నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు రాష్ట్రంలో నిరుద్యోగులు,మహిళలు,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు శుభ పరిణామం అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.పరిశ్రమలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు,నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు 50 శాతం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమన్నారు.ఇలాంటి మంచి వార్త రాష్ట్ర ప్రజలందరికి చేరకూడదని చంద్రబాబు అడ్డుపడటం దుర్మార్గమన్నారు.ప్రతిపక్ష సభ్యులతో స్పీకర్‌ పొడియం వద్దకు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షం అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. దురాలోచనలతో టీడీపీ ప్రవర్తిస్తుందని తెలిపారు.టీడీపీ తీరును రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరారు.
 

తాజా ఫోటోలు

Back to Top