తప్పుడు ప్రచారాలు చేస్తే.. చూస్తూ ఊరుకోం

చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఫైర్‌
 

విజయవాడ: దుష్ప్రచారంలో చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయాడని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అనుకూల మీడియంతో తప్పుడు ప్రసారాలు, కథనాలు రాయిస్తూ ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. విజయవాడలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. నిజాలను వక్రీకరించడం చంద్రబాబుకు అలవాటని, నీచ రాజకీయాలు చేయడంలో దిట్ట అని మండిపడ్డారు. టీడీపీ నేతలంతా ఫ్రస్టేషన్‌లో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Back to Top