పల్నాడు జిల్లా: రామిరెడ్డిపాలేనికి చెందిన వెంకాయమ్మ మేమంతా సిద్ధం బస్సుయాత్రలో వస్తున్న సీఎం వైయస్ జగన్‌ను చూసేందుకు వచ్చింది. జనసందోహం మధ్యలో కాళ్ల చెప్పులు తెగిపోయాయి. ఒకపక్క నడినెత్తన ఎండ, కాళ్లను కాల్చేస్తూ రోడ్డు...అయినప్పటికీ వెనక్కితగ్గలేదు. జగనన్నను కలవాలనే పట్టుదలతో, ఆయనపై అభిమానంతో వస్తున్న ఆమెను గమనించిన ముఖ్యమంత్రి బస్సు వద్దకు పిలిచి మాట్లాడారు. సంక్షేమ పథకాలు అన్నీ సరిగ్గా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. జగనన్నను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్న వెంకాయమ్మ... జగనన్న పాలనలోనే తన పిల్లల చదువుకు అమ్మ ఒడి వచ్చిందని, రైతుభరోసా అందుతోందని, పేదలకు మంచి చేసే జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపింది.