అల్జీమర్స్ చంద్రబాబు..ఆల్ జీరో టీడీపీ 

సభలో టీడీపీ తీరుపై మండిపడ్డ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

బాబు ఎన్ని హామీలిచ్చినా వాటికి విశ్వనీయత లేదు...

విలువలు, విశ్వసనీయత అంటే జగన్మోహన్ రెడ్డి గారే

చెప్పిన ప్రతి ఒక్క మాటా చేసిచూపించిన ప్రభుత్వం మాది.  

మంచిని గుర్తించలేని ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. 

శాసనసభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన జుగుప్సాకరం

ఆల్ జీరో టీడీపీకి వంతపాడుతున్న పవన్ కల్యాణ్

మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఫైర్‌

అమ‌రావ‌తి: అసెంబ్లీలో టీడీపీ తీరుపై  సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ మండిప‌డ్డారు.  అల్జీమర్స్ చంద్రబాబు..ఆల్ జీరో టీడీపీ అంటూ అభివ‌ర్ణించారు. ఇవాళ మేము శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతుంటే.. ప్రజలకు జరిగన మేలు గురించి చెబుతుంటే వినలేని పరిస్థితిలో ప్ర‌తిప‌క్షం ఉండటం బాధాకరం. సభలోకి ఫ్ల కార్డులు పట్టుకురావడం.. స్పీకర్‌ గారి చైర్‌ చుట్టూతా చేరి .. గౌరవ స్పీకర్‌ గారిపై కాగితాలు చించి విసరడం, విజిల్స్‌ వేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బీసీ సంక్షేమం, సమాచారశాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. 

మంచిని వినలేని విఫల ప్రతిపక్షమదిః
రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి, మేలు జరగడానికి ఏమాత్రం ఇష్టపడని తెలుగుదేశం పార్టీ.. చివరికి విఫల ప్రతిపక్షంగా మిగిలింది. ఇది చాలా దురదృష్టకరం. ఆ పార్టీ సభ్యులు శాసనసభకు వస్తూనే.. ఎప్పుడెప్పుడు సభ నుంచి బయటకు వెళ్దామా.. అనే లక్ష్యంతో వస్తున్నారేమో.. ప్రజలకు జరుగుతున్న మంచిని.. జరగబోయే మంచిని వారు వినలేకపోవడం కూడా చాలా బాధాకరం. ఈ పరిస్థితిని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. 

బాబు మోసాలపై అర్ధవంతమైన ప్రసంగంః
నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభలో కొన్ని అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ముఖ్యంగా దాదాపు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానమని చెప్పుకునే ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించారనే విషయంపై చెప్పారు. ఏ విధంగా ఆయన అబద్దాలతో ఈ రాష్ట్ర ప్రజల్ని దగా చేశారనేది ప్రతీ అంశాన్ని స్పష్టంగా వైయ‌స్ జగన్  వివరించారు. ఒక అబద్దాన్ని నిజం చేయాలనే చంద్రబాబు ప్రయత్నం రాష్ట్రప్రజలందరికీ అర్ధమైంది. 

చెప్పిందే చేసి చూపిస్తున్న సీఎం వైయ‌స్ జగన్‌గారుః
ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా దేశంలోనే శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ముందు వరుసలో నిలిచారు. చేయనిది చెప్పలేను.. చేయగలిగిందే చెబుతాను. చెప్పిన మాట చేసి చూపించేందుకు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించనంటూ.. ఎన్నికల మ్యానిఫెస్టోను తూ.చా తప్పకుండా నూటికి నూరుశాతం అమలు చేసిన ఘనత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గారికే దక్కుతోంది.     

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షంః
 చంద్రబాబు పరిపాలన కాలంలో లెక్కలేనన్ని చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల్ని కనీసం పట్టించుకోని పరిస్థితి, రైతులకెక్కడా ఇన్‌పుట్‌ సబ్సిడీ గానీ ఇన్య్సూరెన్స్‌ గానీ అందించిన దాఖలాలే కనిపించవు. ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేశారు. పేదరికాన్ని రూపుమాపాలనే ఆలోచన కూడా చేయలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఇష్టానుసారంగా అనుమతులిచ్చి.. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలన్నింటీనీ నిర్వీర్యం చేశాడు. ఇన్ని తప్పుడు పనులు చేసిన టీడీపీ.. ఇవాళ మేము శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతుంటే.. ప్రజలకు జరిగన మేలు గురించి చెబుతుంటే వినలేని పరిస్థితిలో ఉండటం బాధాకరం. సభలోకి ఫ్ల కార్డులు పట్టుకురావడం.. స్పీకర్‌ గారి చైర్‌ చుట్టూతా చేరి .. గౌరవ స్పీకర్‌ గారిపై కాగితాలు చించి విసరడం, విజిల్స్‌ వేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాను. మీరు అధికారంలో ఉండగా ప్రజలకు ఏమీ చేయకున్నా.. మా ప్రభుత్వం వచ్చాక మేం చేసిన ప్రజామేలును వివరిస్తుంటే.. ప్రతిపక్ష సభ్యులు అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. 

పవన్‌కళ్యాణ్‌ మాటలు ప్రజాస్వామ్యంలోనే ఒక వింతః
పేదవాడ్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేది డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయం. అలాంటి మహోన్నతుల ఆశయాలకనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు తన పరిపాలనలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. డీబీటీ ద్వారా అర్హులైన పేదల ఖాతాల్లో రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిని జమచేసి మేలు చేశారు. ఇది పవన్‌కళ్యాణ్‌ కు నచ్చడం లేదంట. ఇతను రాజకీయాల్లోకొచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కాదా..? నిత్యం మోసాలతో ప్రజల్ని మభ్యపెట్టే చంద్రబాబు పక్కన చేరి పవన్‌ సాధించేదేముంది..? ఒకపక్కన ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున మంచి చేస్తుంటే.. అన్నిరంగాల ప్రజలు ప్రభుత్వ మంచిని హర్షిస్తోంటే.. ఈ పవన్‌కళ్యాణ్‌ మాత్రం ఎందుకు విమర్శిస్తున్నట్టు..?  మంచిని ప్రోత్సహించాల్సిన సంస్కారం ఆయనకు లేదా..? కేవలం ఒక కులానికే ప్రతినిధిగా ఆయన మాటలతీరును ప్రజాస్వామ్యవాదులంతా తప్పుబడుతున్నారు. మంచి చేస్తోన్న ప్రభుత్వాన్ని గద్దె దింపుతానంటూ.. ప్రజల ముందుకొస్తున్న పవన్‌కళ్యాణ్‌ మాటలు ఈ ప్రజాస్వామ్యంలోనే వింతగా చెప్పుకోవాలి. 

Back to Top