మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజితపై అక్రమ కేసు

నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజిత పై అక్రమ కేసు నమోదైంది. వినతి పత్రం ఇచ్చినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకాణి కుమార్తె పూజిత సహా  వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మేరుగ మురళిలపైనా పోలీసులు కేసులు పెట్టారు. జేసీకి కార్తీక్ కి వినతిపత్రం ఇచ్చినందుకు కేసు నమోదు చేశారు.

కాకాణి అక్రమ అరెస్ట్‌పై సీబీఐ విచారణ జరపాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు. నిన్న జేసీని కాకాణి కుమార్తె పూజిత, ఎమ్మెల్సీలు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కలిశారు. దీంతో ప్రజలకు అశాంతి కలిగించారంటూ పది మందిపై అక్రమ కేసు నమోదు చేశారు. పోలీసులు అక్రమ కేసుపై  నెల్లూరు ప్రజలు విస్తుపోతున్నారు.

Back to Top