యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల  వైయస్‌ జగన్‌ సంతాపం

 తాడేప‌ల్లి: ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ఎనలేని ప్రతిభ చూపి, అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రముఖ నృత్య కళాకారిణి పద్మ విభూషణ్‌ డాక్టర్‌ యామినీ కృష్ణమూర్తి మరణం పట్ల  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతికి గుర‌య్యారు.  భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో తనదైన శైలితో అద్భుత ప్రతిభ చూపిన యామినీ కృష్ణమూర్తి శాస్త్రీయ నృత్యంలో చెరగని ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. యామినీ కృష్ణమూర్తి మరణం శాస్త్రీయ నృత్య రంగంలో తీరని లోటని, ఆమె తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అని తెలిపారు. యామినీ కృష్ణమూర్తి ఆత్మకు శాంతి కలగాలని వైయస్‌ జగన్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 

Back to Top