ఆర్థికాభివృద్ధి దిశ‌గా మ‌హిళ‌ల అడుగులు

వైయ‌స్ఆర్ చేయూత కార్య‌క్ర‌మంలో హోం మంత్రి తానేటి వ‌నిత‌

ఏలూరు:  వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కం ద్వారా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆర్థిక‌సాయం అందించ‌డంతో మ‌హిళ‌లు ఆర్థికాభివృద్ధి దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని హోం మంత్రి తానేటి వ‌నిత తెలిపారు. మహిళలు రథసారథులని చేయూత పధకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం తో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు. వైయ‌స్ఆర్ చేయూత ద్వారా వరుసగా మూడో విడత నగదు పంపిణీ చేసే కార్యక్రమాన్ని బల్లిపాడు లో రాష్ట్ర హోంమినిస్టర్ డాక్ట‌ర్ తానేటి  వనిత ప్రారంభించారు. తాళ్లపూడి మండలానికి మంజూరు కాబడిన చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసుగల బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరికి 18,750 రూపాయల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.
 
 వైయస్ జ‌గ‌న్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుల, మత, పార్టీ భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, 60 సంవత్సరాలు నిండితే పెన్షన్ అంతేకాకుండా చేయూత కాపు నేస్తం, రైతు భరోసా, పేదలకు ఇళ్ల స్థలాలు ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. 

Back to Top