ఐటీడీపీ అంటే బ్లూఫిలింల తయారీ కంపెనీ

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) 
 

 గుడివాడ: ఐటీడీపీ అంటే బ్లూఫిలింల తయారీ కంపెనీ అని, దానికి నిర్మాత చంద్రబాబు నాయుడని, దర్శకత్వం పప్పు నాయుడని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)  తెలిపారు. దీని ద్వారా ఒకరి ఫొటోలకు వేరొకరి ఫొటోలు తొడగడం, వాటిని ఈనాడు, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి తెలుగుదేశం మీడియా ద్వారా ప్రచారం చేయించడం జరుగుతుందని అన్నారు. ఈ పత్రికలు, చానళ్లు పబ్లిసిటీ ఏజెన్సీలుగా పని చేస్తున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రోజురోజుకు క్షీణించిపోవడంతో ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా బురద చల్లాలనే ఉద్దేశంతో బ్లూ ఫిలింల సమస్యను తెరమీదకు తెస్తున్నారని నాని అన్నారు.

 ప్రజలకు ఏ విధమైన సమస్య లేకుండా తాము పాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు అండ్‌ కోకు పనులు లేకుండా పోయాయని అన్నారు. దీంతో పప్పు నాయుడుకి గల ఐటీడీపీ ద్వారా నీచ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు.

గత వారం రోజులుగా రాష్ట్రంలో వారు చేసిన అల్లరి అంతా ఇంతా కాదన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ నెత్తినోరు కొట్టుకుని అది నాది కాదు అంటే అది నీదే అంటూ ఈ పచ్చ మీడియా, టీడీపీ నేతలు బురదచల్లుతున్నారన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top