శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు ఘ‌న స్వాగ‌తం

నంద్యాల‌: భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నేడు శ్రీశైలంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు.  అక్కడి నుండి రాష్ట్రపతి నేరుగా హెలికాప్టర్‌లో శ్రీశైలానికి బయలుదేరారు. శ్రీ‌శైలంలో ద్రౌపదిముర్ముకు రాష్ట్ర మంత్రులు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గ‌న రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిలు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.   శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో రాష్ట్రపతి పూజల్లో పాల్గొంటారు. ఆ తరువాత శ్రీశైలంలోని 'ప్రసాద్‌' పథకంలో భాగంగా పలు ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.  

Back to Top