వైయస్ఆర్ జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం గ్రామంలో జరగబోయే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో పాల్గొనేందుకు గన్నవరం నుండి విమానంలో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 1.05 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడప విమానాశ్రయం చేరుకున్నారు. కడప విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ జఖియా ఖనం, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, సుధీర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లి మల్లిఖార్జున రెడ్డి, రాష్ట్ర ఉద్యాన శాఖ సలహా మండలి సలహాదారులు పి.శివప్రసాద్ రెడ్డి, కడప ఆర్డీవో మధుసూదన్, తదితరులు ఘన స్వాగతం పలికారు. పాలసముద్రంలో జరిగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కడప విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.22 గంటలకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి