తాడేపల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి నెలకొంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు శ్రీ వైయస్ జగన్‌కు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌ను కలిసి రాఖీ కట్టడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. అక్కాచెల్లెళ్లకు వైయస్ జగన్ శుభాకాంక్షలు తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు శ్రీ వైయస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని శ్రీ వైయస్ జగన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఆత్మీయ వాతావరణంలో జరిగాయి.