చర్చల అనంతరం పీఆర్సీపై ప్రకటన

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: కాసేపట్లో ఫిట్‌మెంట్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తుది నిర్ణయం తీసుకుంటారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపామన్నారు. ఉద్యోగ సంఘాలతో నిన్న కూడా సీఎం వైయస్‌ జగన్‌ చర్చలు జరిపారన్నారు. ఇవాళ తుది చర్చలు జరిగిన తరువాత పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. కాసేపట్లో ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి భేటీ కానున్నారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని అన్ని సంఘాలను చర్చలకు ఆహ్వానించారు. 
 

తాజా వీడియోలు

Back to Top