కోవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం

ప్రతి నియోజకవర్గంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం

ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను

కృష్ణా: కోవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడుతున్నామని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు చెప్పారు. కరోనా నివారణ చర్యలపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌తో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఉదయభాను మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌ కట్టడికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అనేక చర్యలు చేపట్టారన్నారు. 

ప్రతి నియోజకవర్గంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 100 బెడ్స్‌ సిద్ధం చేస్తున్నామని, ఉచితంగా మందులు, భోజనం, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, ఆక్సిజన్‌ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్షనేత చంద్రబాబు.. ఎంతసేపు బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు మాటలకు ప్రజలు కూడా విసుగెత్తిపోయారన్నారు.  

 

Back to Top