పవర్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించిన లిఖితకు వైయ‌స్‌ జగన్‌ అభినందనలు

 తాడేపల్లి: కెనడాలోని విన్నిపెగ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన గుంటూరుకు చెందిన యువ క్రీడాకారిణి బొల్లు లిఖితకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్‌కు బంగారు పతకం సాధించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.

లిఖిత విజయానికి ఆమె కుటుంబ సభ్యులు, కోచ్‌లు అందించిన ప్రోత్సాహం, సహకారం అభినందనీయమని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. యువతులు క్రీడల్లో రాణిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని, లిఖిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.  “లిఖితా.. నీకు మరిన్ని విజయాలు లభించాలని కోరుకుంటున్నాను” అంటూ అభినందనలు తెలిపారు.

Image

Back to Top